• 11/march/2010/thursday
  • మార్కెట్ నాడి

కార్పోరేట్ బాండ్ మార్కెట్లు ఆశాజనకం గా ఉండటం, ఇన్వెంట్రీస్ తగ్గుముఖం పట్టటం వంటి సానుకూల అంశాల నేపధ్యం లో గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. నేటి ఆసియా మార్కెట్లు కూడా శుభారంభం చేయటం తో నేడు మన మార్కెట్ల కి సానుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. గ్రీస్ దేశం లో సంక్షోభం నుండి బయటపడే మార్గం దొరకటం తో , ఈ తరహా సంక్షోభం , ప్రస్తుతానికి ప్రపంచం లో ఇతర మార్కెట్లకు వ్యాప్తి కాకుండా అరిగట్టి నందుకు గాను ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

చైనా దేశం ఎగుమతులు ల కూడా 47 % వృద్ధి నమోదు చేయటం కూడా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదుట పడుతున్న సంకేతాలు వెలవడటం కూడా ఆసియా మార్కెట్లకు కలిసొస్తోంది .

అదే విధం గా సింగపూర్ మార్కెట్ కూడా అతి కీలక అవరోధం అయిన 2860 పాయింట్ల అవరోధం దాటటం కూడా సింగపూర్ మార్కెట్లను, తద్వారా మన నిఫ్టీ ని సానుకూలం గా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

మన మార్కెట్లు నేడు సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం వలన శుభారంభం చేసే అవకాశం ఉంది. నేడు రష్యా ప్రెసిడెంట్ భారత్ దేశం విచ్చేయనున్నారు. వారి పర్యటన లో అణుశక్తి కి సంబంధించిన కీలక ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ కారణం గా ఒకటి రెండు రోజుల లో ఒప్పందం తదుపరి పవర్ స్టాకులు లాభపడే అవకాశం ఉంది. మదుపరులు ఈ అంశం పై ఇప్పటినుండే దృష్టి నిలపటం లాభదాయకం.

నేడు ఆహార ద్రవ్యోల్బణ గణాంకాలు వెల వడనున్నాయి. ఇప్పటికే గరిష్ట స్థాయి కి ఎగబాకుతున్న ద్రవ్యోల్బణం మరింత పెరిగితే మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నేడు ఈ అంశం మార్కెట్ల లో ని బుల్ రన్ కి బ్రేక్ వేసే అవకాశం లేకపోలేదు .

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • · గత ముగింపు:: 17౦98
  • · అవరోధాలు : 17180 * 17226-17351
  • · మద్దత్తు స్థాయిలు : 16963-16894- 16666