• 11-3-2010
  • మార్కెట్ రిపోర్ట్

నేడు ట్రేడింగ్ లో ప్రధానం గా ఫ్లాట్ గా పయనించిన మన మార్కెట్లు , చివరి క్షణాల లో అమెరికా ఫ్యుచేర్స్ లాభం నమోదుచేయటం తో , లాభాలను ఆర్జించాయి. దీనితో సెన్సెక్స్ 69 పాయింట్లు లాభపడి 17168 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 17 పాయింట్ల లాభం తో 5133 పాయింట్ల వద్ద ముగిసింది. ఐతే నేడు మిడ్ క్యాప్ రంగం 0.15 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.50 శాతం చొప్పున నష్టపోయాయి

సేక్టోరల్ సూచీ ల లో నేడు ఐ.టి ఇండెక్స్ 1 % , టెక్ సూచీ 0.93 % లాభపడ్డాయి. కాగా ఆటో సూచీ అత్యధికం గా 0.95 % , FMCG ౦.79% నష్టపోయాయి.

నేడు విడుదల ఐన తాలూకు ఆహార ద్రవ్యోల్బణం స్వల్పం గా తగ్గుముఖం పట్టింది. ఇది ఫిబ్రవరి 27 కి గాను 17.81 శాతం గా నమోదు ఐయింది. ఇదే ఫిబ్రవరి 20 కి గాను 17.87 శాతం గా ఉండింది.

స్టాకుల పరం గా, నేడు లిస్టింగ్ జరిగిన MAN INFRA CONSTRUCTION 38 % ఎగబాకి శుభారంభం చేసింది. కాగా నిన్న లిస్టింగ్ జరిగిన TEXMO PIPES నేడు కూడాలాభాల పరంపర కొనసాగిస్తూ 7 % వృద్ధి పొందింది. NMDC FPO కి మదుపర్ల ఆదరణ కొరవడటం తో నేడు ఈ కౌంటర్ 5 % నష్టపోయింది. 400 కోట్ల ప్రాజెక్ట్ చేజిక్కించు కోవటం తో నేడు AREVA T & D 1.77 % ఎగబాకింది నేడు షుగర్ స్టాకులు భల్లు కాల దెబ్బ కి వరుసగా రెండవ రోజు కుదేలు మన్నాయి. కీలక ముడి పథార్థ మైన బొగ్గు ధరలు పెరుగుతుండటం తో స్టీల్ రంగానికి చెందినా స్టాకులు నష్టపోయాయి. డిజిటల్ మీడియా లో అరెంగేట్రం చేసినందుకు గా నేడు భారతి అయిర్ టెల్ 2 % లాభపడింది. కాగా ఇతర టెలికాం స్టాకులు సుమారు 1 % నష్టపోయాయి. LIC తమకున్న 6.2 % వాటాని అమ్మివేయటం తో TILAKNAGAR INDUSTRIES 4 .54 % నష్టపోయింది.

నిఫ్టీ స్టాకు ల లో ABB , SUN PHARMA 3.1 % చొప్పున లాభపడ్డాయి. కాగా HUL , IDEA 4.4 %, 2.1 % చొప్పున నష్టపోయాయి.