- 10-3-2010
- మార్కెట్ రిపోర్ట్
నేడు మన మార్కెట్లు మరొక సారి ఆటు పొట్ల కి గురి అయ్యాయి. ఉదయం లాభాలను నమోదు చేసిన మార్కెట్లు మధ్యాన్నం తదుపరి అమ్మకాల వత్తికి గురి అయ్యి చిట్టా చివరికి స్వల్ప లాభాలను నమోదు చేస్తూ ముగిసాయి. దీనితో సెన్సెక్స్46 పాయింట్లు లాభ పడి 17098 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 14.75 పాయింట్ల లాభం తో 5116 పాయింట్ల వద్ద ముగిసింది. ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.13 % , స్మాల్ క్యాప్ రంగం 0.21 % నష్టపోయాయి. సేక్తోరాల్ సూచీ ల లో చమురు మరియు గ్యాస్ రంగం అత్యధికం గా 0.93 % లాభ పడింది. కాగా fmcg 0.81 % వృద్ధిని నమోదు చేసింది. రియాలిటి , ఆటో రంగాలు కూడా నేటి ట్రేడింగ్ లో ముందంజ వేసాయి. ఐతే నేడు టెక్ రంగం 0.41 % నష్టపోయి సెన్సెక్స్ బలహీనత కి కారణమయ్యింది. ఐ.టి ఇండెక్స్ కూడా 0.37 % మేరకు క్షీణించాయి.
నేడు తాజా లిస్టింగ్ ఐన TEXMO PIPES 50 % వృద్ధిని నమోదు చేస్తూ శుభారంభం చేసింది. సిమెంట్ ధరలు పెంచనున్నట్లు వార్త వేలవాడటం తో నేడు సిమెంట్ స్టాకులు సుమారు 2 % వృద్ధిని నమోదు చేసాయి. BINANI, AMBUJA, ACC మున్నగు స్టాకులు లాభపడ్డాయి. NMDC FPO కి పెద్ద స్పందన లభించలేదు. నేటి సాయంత్రానికి కేవలం 0.09 % మాత్రమె దరకాస్తులు అందాయి. ఐతే ఈ స్టాకు నేడు సుమారు 1.12 % లాభపడింది. అమెరికా కంపని ఐన BABCOCK తో ఒప్పందం ఖరారు అవ్వటం తో నేడు THERMAX 2.7 % లాభపడింది.
స్టాకుల పరం గా నేడు కావేరి టెలికాం , RIGHTS ఇస్స్యు ని వయదావేయటం తో ఈ కౌంటర్ 4 % వృద్ధి పొందింది. అ