• 10-3-2010
  • మార్కట్ నాడి

నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు ఆటు పోట్ల కి గురయ్యి స్వల్ప లాభాల తో ముగిసాయి. అమెరికా గ్రీస్ దేశాల మధ్య జరిగిన చర్చ లో , గ్రీస్ దేశం ప్రెసిడెంట్ ,, మార్కెట్ స్పెక్యులేట ర్లు వలన తమ దేశం పై మరింత వత్తిడి పెరగనున్నదని, కాబట్టి క్రెడిట్ స్వాప్ లను నియంత్రించాలని ఒబామా ని కోరారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ప్రత్యేకించి స్పందించక పోవటం వలన మార్కెట్ల లో అయోమయ స్థితి నెల కొనింది . దీనితో మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి.

అమెరికా మార్కెట్ల నుండి ప్రత్యేకమైన సంకేతాలు లేనందున నేడు ఆసియా మార్కెట్లు కూడా దిశా హీనంగా పయనిస్తున్నాయి . జపాన్ లో మషీన్ ఆర్డర్ల గణాంకాల లో 37 % క్షీణత నమోదు కావటం కూడా ఆసియా మార్కెట్ల బలహీనత కి కారణమౌతోంది.

నేడు మన మార్కెట్లు కూడా నిన్నటి విధం గా నే ప్రాఫిట్ బుకింగ్ కి గురి అయ్యే సూచనలు ఉన్నాయి.మార్కెట్లకు ఊతం కలగ జేసే అంశాలు ప్రత్యేకించి లేకపోవటం కూడా నేడు మన మార్కెట్లు ఆటు పోట్ల కి గురి అయ్యే అవకాశాన్ని పెంచింది

. ఐతే నేడు మన మార్కెట్లు స్టాకుల పరంగా కొంత ముందంజ వేసే అవకాశం ఉంది. విశేషమైన వార్తలు ఉన్నందున EXIDE, UNION BANK మున్నగు కౌంటర్ల ల లో మదుపర్లు కొంత ఆసక్తి కనపరిచే ఆస్కారం ఉంది.

· నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :

· గత ముగింపు:: 17056

· అవరోధాలు : 17130- 17226-17351

· మద్దత్తు స్థాయిలు : 16963-16894- 16666