• 8-3-2010
  • మార్కెట్ రిపోర్ట్

సానుకూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో శుభారంభం చేసిన మార్కెట్లు గరిష్ట స్థాయి ల లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవటం తో మార్కెట్లు స్వల్ప ఆటు పొట్ల కు గురి అయ్యి చివరికి లాభాల తో ముగిసాయి . నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్108 పాయింట్లు లాభపడి 17102 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 35.30 పాయింట్ల లాభం తో 5124 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం ౦.7 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.09 శాతం లాభ పడటం విశేషం `

సేక్తోరాల్ సూచీ ల లో నేడు ఆటో రంగం గరిష్టం 1.79 % వృద్ధిని నమోదు చేసింది . కాగా బ్యాంకింగ్ సూచీ 1.09 % ఎగబాకింది. నేడు రియాలిటి రంగం అత్యధికం గా పతనం అయ్యింది. ఈ రంగం 0.59 శాతం కోల్పోయింది. కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ 0.13 % క్షీణించింది.

పార్లమెంట్ లో మహిళా బిల్ పైఏర్పడిన రాజకీయ అనిశ్చిత కూడా మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బ తీసింది. నేటి స్టాకు ల లో హీరో హోండా నేడు సుమారు 3 % ఎగబాకింది. వాహనాల తయారికి గాను కొత్త ప్లాంట్ నెలకొల్పనున్న వార్త వలన ఈ కౌంటర్ లాభాలను ఆర్జించింది. లోక్ సభ లో SBI బిల్లు ని ప్రవేశపెట్టటం తో SBI కౌంటర్ 1.16 % లాభపడింది. 1221 కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కించుకోవటం తో NAGARJUNA CONSTRUCTION 2.45 % వృద్ధి చెందింది. కాగా నేడు టెలికాం స్టాకు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. మేము మా " మార్కెట్ ముందు చూపు " శీర్షిక లో సూచించిన విధం గా NMDC పతనం కొనసాగుతోంది.

నిఫ్టీ స్టాకు ల లో నేడు AMBUJA CEMENT అత్యధికం గా 5.1 % , MNM 4.3 % లాభపడ్డాయి. కాగా RANBAXY 2.6 %, UNITECH 2.4 % మేరకు నష్టపోయాయి.