- 9 / 3 / 2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. ఈ కారణం గా నేడు ఆసియా మార్కెట్లు కూడా అమెరికా మార్కెట్లను అనుకరిస్తూ స్వల్ప నష్టాలను నమోదు చేస్తున్నాయి. గత ఐదు రోజులుగా లాభాలను ఆర్జించిన ఆసియా మార్కెట్ల లో నేడు లాభాల స్వీకరణవైపు ట్రేడేర్లు మగ్గు చూపుతున్నారు.
మన మార్కెట్ల పరం గా యోచిస్తే, ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జీ , మన దేశానికి 9 శాతం వృద్ధి సాధ్యమేనని విశ్వాసం వెల బుచ్చటం, ప్రణాళికా సంఘ ఉపాద్యక్షులు మోంటెక్ సింగ్ ఆహువాలియా ద్రవ్యోల్బణం అతి త్వరలో తగ్గు ముఖం పట్టనున్న
.కేంద్ర ఉక్కు శాఖా మాత్యులు వీరభద్ర సింగ్ ,ప్రభుత్వం మార్కెట్ల నుండి సమీకరించ దలచుకున్న ధనం లో సగం భాగం తమ శాఖ నుండి జరగనున్నదని, nmdc, sail లో ని వాటా విక్రయాల తో పాటు తాజా గా manganese ore లో వాటాలను కూడా మార్కెట్ల లో విక్రయించదలచినట్లు ప్రకటించటం వలన నేడు psu స్టాకులు , ముఖ్యంగా ప్రభుత్వ ఉక్కు సంస్థల వాటాలు లాభపడే అవకాశం ఉంది.
ఐరోపా మార్కెట్ల ప్రభావం కూడా మధ్యాన్నం తదుపరి మన మార్కెట్ల పై ఉండనున్నది. గ్రీస్ దేశాన్ని అవసరమైతే ఆదుకునేందుకు అమెరికా సంసిద్ధత ప్రకటించటం వలన ప్రస్తుతానికి గ్రీస్ సంక్షోభానికి తాత్కాలికం గా దించినట్లయ్యిందని ఐరోపా మార్కెట్లు భావించ వచ్చు. కాగా గ్రీస్ తరహా లో పోర్చుగల్ దేశం కూడా బడ్జెట్ లోటు పై నియంత్రణ సాధించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించటం కూడా ఐరోపా మార్కెట్లకు, తద్వారా మధ్యాన్నం తదుపరి మన మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశం
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:: 17102
- అవరోధాలు : 17180-17226-17351
- మద్దత్తు స్థాయిలు : 16963-16894- 16666