• 8-3-2010
  • మార్కెట్ నాడి

శుక్రవారం అమెరికా మార్కెట్లు చక్కటి లాభాలు గడించటం తో నేటి ఆసియా మార్కెట్లు కూడా శుభారంభం చేసాయి, అమెరికా లో తగ్గుముఖం పడుతున్న నిరుద్యోగ సమస్య, పెరిగిన వినియోగ దారుల క్రెడిట్ గణాంకాల నేపధ్యం లో స్టాక్ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. నేటి ఆసియా మార్కెట్లు కూడా సుమారు 1 % నుండి 1. 5 % లాభాల లో పయనిస్తున్నాయి.

గత వారం ముగింపు లో లాభాల స్వీకరణ వలన ఫ్లాట్ గా ముగిసిన మన మార్కెట్లు నేడు సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో జోరు గా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రధాన మంత్రి దేశ GDP వృద్ధి కనీసం 8 % ఉండగలదని ప్రకటించటం మార్కెట్ల లో మరింత ఉత్సాహం నింప నున్నది . అదే విధం గా శీతాకాలం పంట చేతి కందటం వలన ఆహార ధాన్యాల ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నట్లు తెలియచేసారు , ఇది ఇలా వుండగా , మార్కెట్ల నుండి ధనం సమీకరించాలన్న ప్రభుత్వ యోచన వలన . ప్రైవేటు రంగానికి , నిధుల అందుబాటు కి ఎటు వంటి కొరత వాటిల్లదని ఆర్థక మంత్రి ప్రనాబ్ ముఖేర్జీ ప్రకటించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రభు త్వం మార్కెట్ల నుండి 457 కోట్ల రూపాయలను సమీకరించాలన్న ఆలోచనల లో వున్నట్లు ప్రకటించారు. కాగా ఇందులో భాగం గా ఇప్పటికే NMDC FPO ని ప్రకటించిన సంగతి విదితమే.

ఇతర ప్రపంచ మార్కెట్ల కి సంబంధించిన కీలక విషయాలను టూకీగా చర్చిస్తే, ఆర్ధిక సంక్షోభం లో చిక్కుకున్న గ్రీస్ దేశాన్ని రక్షించాలని ఐరోపా సమాఖ్య ( EUROPEAN UNION ) నిర్ణయం తీసు కున్నది. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలను సమర్దవంతం గా ఎదురుకునెందుకు గాను ప్రపంచ బ్యాంకు తరహా లో ఐరోపా బ్యాంకు ని ఒకటి నెలకొల్పటం మంచిదని జర్మనీ ప్రతిపాదన చేసింది. కాగా అమెరికా లో అక్కడి ప్రజలకు ఆరోగ్య రక్షణ కొరకై ప్రత్యెక బిల్లు ని సెనేటు ఆమోదం కై ప్రెసిడెంట్ ఒబామా ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లు వలన ప్రైవేటు బీమా . ఆరోగ్య రంగాలకి చెందిన కంపనీల పై భారం పడనున్నది. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికా మార్కెట్లు కొంత క్షీణించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా అమెరికా బడ్జెట్ లోటు 1 .2 ట్రిలియెన్ డాలర్లు కాగలదని , ఇది GDP లో సుమారు 4. 6 % శాతమని అంచనాలు వెలవడు తున్నాయి /ఈ అంశాలు రాగల రోజుల లో మరింత కీలక పాత్ర పోషించనున్నాయి .

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 16994
  • అవరోధాలు : 17024-17226-17351
  • మద్దత్తు స్థాయిలు : 16963-16894- 16666