• మార్కెట్ ముందు చూపు
  • (8-3-2010 నుండి 12-3-2010 వరకు )

సానుకూల బడ్జెట్ ప్రతిపాదనల వలన గత వారం మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.బడ్జెట్ లోటు ని తగ్గించే దిశ గా సానుకూల సంకేతాలు ఆర్ధిక మంత్రి తెలియపరచటం, పెట్రోల్ , డిజిల్ ధరలను పెంచేందుకు గాను సోనియా గాంధి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మున్నగు కారణాలు మార్కెట్ల సెంటిమెంట్ ని బలపరిచాయి. సానుకూల ప్రపంచ మార్కెట్లు కూడా మన మార్కెట్లకు సహకరించటం తో 2010 సంవత్సరానికి గాను గరిష్ట స్థాయి లో లాభాలను ఆర్జించిన వారం గా గత వారం రికార్డు సృష్టించింది.

బడ్జెట్ లో వ్యక్తీగత పన్ను రేటు లో పెక్కు మందికి ఉపశమనం లభించనున్నది. ఈ కారణం గా ఏప్రిల్ నుండి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు అధికమయ్యే అవకాశం ఉంది. ఈ కారణం గా మార్కెట్లు రానున్న రోజుల లో స్థిరం గా పయనించే అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. అడపా దడపా లాభాల స్వీకరణ జరిగినా, మొత్తం మీద మార్కెట్లు స్థిరత్వం దిశగా consolidate అయ్యే సూచనలు ఉన్నాయి.

స్టాకుల పరంగా ఈ వారం NMDC అందరి దృష్తి ని ఆకర్షించనున్నది. ప్రభుత్వం NMDC FPO ని రూ. 300 గా , ప్రస్తుత మార్కెట్ ధర అయిన రూ. 414 కంటే తక్కువగా ఉండటం వలన NMDC రూ. 300 వరకు కు క్షీణించ నున్నది. ఈ మధ్య కాలం లో FPO ల పట్ల మదుపరులు ఆదరణ కనపరచట లేదన్న కారణం గా ప్రభుత్వం NMDC ధర ను రూ. 300 గా నిర్ణయించింది.

ఈ వారాంతం లో వెలవడ నున్న పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు కూడా మార్కెట్లు నిశితం గా గమనించనున్నాయి.

గత శుక్రవారం అమెరికా మార్కెట్ల లో నిరుద్యోగం తగ్గుముఖం పడుతున్నదన్న గణాంకాలు వెలవడటం కూడా సోమవారం మన మార్కెట్లకు సానుకూల అంశం .

టెక్నికల్ గా ఈ వారం సానుకూలం గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానం గా సెన్సెక్స్ 16600 17500 మధ్య లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సెన్సెక్స్ నకు 17730 పాయింట్ల వద్ద తీవ్ర అవరోధం ఉంది. నిఫ్టీ నకు 20 రోజల చలన సగటు 5017 పాయింట్ల వద్ద సమీప అవరోధం ఎదురుకోనున్నది. కాగా 50 రోజుల చలన సగటు అయిన 4877 పాయింట్లు కీలక మద్దత్తు కానున్నది. 5160 పాయింట్ల వద్ద నిఫ్టీ తీవ్ర అవరోధం ఎదురుకోనున్నది. టెక్నికల్ గా రోజువారి చార్టు లను విశ్లేషిస్తే macd దిగువకు పయనించ నున్నట్లు సూచిస్తున్నది. RSI కూడా OVER BROUGHT పరిస్థితి ని సూచిస్తున్నది .కాగా వారం వారి గా చార్ట్లు బలంగా ఉనడటం గమనార్హం. కాబట్టి ఈ వారం మార్కెట్లు కొంత ఆటు పాట్లకి గురియ్యే సంకేతాలు చార్ట్లు తెలియచేస్తున్నాయని మనం అన్వయించుకోవచ్చు.