- 5-3-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్ల లు లాభాల తో ముగియటం తో నేడు ఇతర ఆసియా మార్కెట్లు జోరుగా ప్రారంభం చేసాయి. నిరుద్యోగ భత్యం కై దరఖాస్తులు తగ్గటం తో అమెరికా మార్కెట్లు నిన్న లాభాలను ఆర్జించాయి. నూతన గృహాల అమ్మకాల లో తగ్గుదల నమోదు అయినప్పటికీ నిన్న రాత్రి అక్కడి మార్కెట్లు లాభపడటం విశేషం. నేడు ఆసియా మార్కెట్లు , నిన్నటి నష్టాలను అధికమిస్తూ లాభాల లో పయనిస్తున్నాయి.
మన దేశం లో చోటు చేసుకున్న కీలక అంశాలను గమనిస్తే, పెట్రోల్ ధరలను పెంచేందుకు సోనియా గాంధీ కూడా ఆమోదం తెలపటంతోఆర్ధిక మంత్రికి పెట్రోల్ ధరలపై తీసుకున్న నిర్ణయం ని అమలు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. దీనితో క్రమేపి పరిక్ కమిటి సిఫారిసులు కూడా అమలుపరిచే అవకాశం మెరుగయ్యింది. ఈ అంశం ఆయిల్ మార్కెటింగ్ కంపనీలకి కొంత ఊరట కలిగించ వచ్చు . అదే విధం గా , గోధుమ , బియ్యం ఎగుమతుల పై నిషేధం ఎత్తివేయనున్నట్లు వ్యవసాయ మంత్రి ప్రకటించటం కూడా అగ్రి ఎగుమతుల స్టాకు లైన kohinoor , daawat మున్నగు వాటికి లాభం చేకూరే అవకాశం ఉంది. పైగా ఐరోపా సమాఖ్య ( EU) భారత దేశం తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ , ద్వైపాక్షిక ఒప్పందం -ఈ అక్టోబర్ మాసానికి చేసుకోదలచినట్లు అధికారులు ప్రకటించటం కూడా దేశ ఎగుమతులకు మరింత ప్రోత్సహకారిగా మారనున్నది.
సానుకూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు శుభారంభం చేసే సూచనలు ఉన్నాయి. ఐతే మధ్యాన్నం తదుపరి రెండు అంశాలు కీలకం కాగలవు. గ్రీస్ దేశం ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కేందుకు గాను జర్మనీ తో సంప్రదింపులు నేడు చేయనున్నది. ఐరోపా సమాఖ్య తో ను, ముఖ్యం గా జర్మనీ తో ఒప్పందం ఖరారు కాక పొతే , గ్రీస్ ప్రపంచ బ్యాంక్ సహాయం ఆర్తించే అవకాశం ఉంది. ఇదే జరిగితే , పరిస్థితి చేయిదాటినట్లు మార్కెట్లు అంచనా వేసే అవకాశం ఉంది. కాబట్టి నేడు మధ్యాన్నం తదుపరి ఐరోపా మార్కెట్ల గమనం అత్యంత నిశితం గా మదుపరులు గమనించటం మంచిది. అదే విధం గా నేడు వారంతం కనుక ట్రేడెర్ లు లాభాల స్వీకరణ కై మగ్గుచూపే అవకాశం కూడా ఉంది. ఐరోపా మార్కెట్లు బలహీనం గా వుంటే ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకోనున్నది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:16971
- అవరోధాలు : 17024-17226-17351
- మద్దత్తు స్థాయిలు : 16963-16894- 16666