- 4-3-2010
- మార్కెట్ రిపోర్ట్
మిశ్రమంగా కొనసాగిన ఆసియా మార్కెట్ల ప్రభావం వలన నేడు మన మార్కెట్ల లో కూడా ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. దీనితో సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 16972 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 8 పాయింట్ల నష్టం తో 5080 పాయింట్ల వద్ద ముగిసింది. ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.78 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.81 శాతం లాభపడటం విశేషం. సేక్తోరాల్ సూచీ ల లో నేడు రియాలిటి ఇండెక్స్ అత్యధికం గా 2.50 % లాభపడింది. కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ సూచీ 1.62 శాతం లాభపడగా ఐ .టి ఇండెక్స్1.03 శాతం, టెక్ ఇండెక్స్ 0.67శాతం నష్టపోయి మార్కెట్లను బలహీన పరిచాయి ప్రభుత్వ అంచనాలను వమ్ము చేస్తూ నేడు విడుదల ఐన ద్రవ్యోల్బణం ఇటు సామాన్యులకును , అటు మదుపరులకును నిరాశ మిగిల్చింది. ఆహార ద్రవ్యోల్బణం ఫెబ్రవరి 20 కి ముగిసిన వారం కి గాను గరిష్టం గా 17.87 % వరకు ఎగబాకింది. ఐతే చేతికందే పంటల వలన ద్రవ్యోల్బణ పాపం "పండి" oదని వ్యవసాయ మంత్రి మరొక సారి పార్లమెంట్ లో తెలియచేసారు .