• 5-3-2010
  • మార్కెట్ రిపోర్ట్

సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో మన మార్కెట్లు శుభారంభం చేసినా, మా అంచనాలను నిజం చేస్తూ మధ్యాన్నం తదుపరి లాభాల స్వీకరణ జోరందుకోవటం తో నేడు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి .

దీనితో సెన్సెక్స్ 22.7 పాయింట్లు లాభ పడి 16994 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 8.4 పాయింట్ల లాభం తో 5088 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 0.13 శాతం , నిఫ్టీ 0.17 శాతం స్వల్ప వృద్ధిని కనపరిచింది. నేడు మిడ్ క్యాప్ రంగం, స్మాల్ క్యాప్ రంగాలు కూడా 0.62 , 0.82 శాతం చొప్పున లాభపడ్డాయి.

సేక్టోరల్ సూచీ ల లో నేడు రియాలిటి సూచీ గరిష్టం గా 1.77 % లాభం ఆర్జించింది. కాగా టెక్ రంగం 0.47 % వృద్ధిని నమోదు చేసింది. నష్టపోయిన సూచీ ల లో psu ఇండెక్స్ 0.55 % క్షీణించి ప్రథమ స్థానం దక్కించుకుంది. కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ 0.54 % మేరకు తగ్గింది.
ప్రస్తుతం పలుకుతున్న మార్కెట్ ధర కంటే కూడా NMDC FPO ని డిస్కౌంట్ ధరకి విక్రయించే యోచన వున్నదని ప్రభుత్వం ప్రకటించటం తో నేడు NMDC మరియు ఇతర పబ్లిక్ రంగ సంస్థలు నష్టపోయి PSU ఇండెక్స్ నష్టానికి కారణమయ్యింది. వడ్డీ రేటుని పెంచనున్నట్లు వార్త వలన నేడు ICICI ,HDFC , కోటక్ మున్నగు ప్రైవేటు బ్యాంకులు సుమారు ౦.5 % లాభపడ్డాయి. బిజినెస్స్ ని పునఃవ్యవస్థీకరణ చేయనున్న నేపధ్యం లో నేడు ZICOM ELECTRONIC 14 % ఎగబాకింది. USFDA నుండి జెనెరిక్ డ్రగ్ తయారికి ఆమోదం లభించటం తో WOCKHARD 4 % లాభపడింది. గుజరాత్ పెట్రో నెట్ నుండి కాంట్రాక్టు లభించినందుకు సుజ్లోన్ 3.61 % లాభపడింది. షిప్పింగ్ స్టాకులు నిన్నటి ఉత్సాహాన్ని నేడు కూడా కొనసాగించాయి. ఈ స్టాకులు సుమారు 1 ~ 3% లాభపడ్డాయి. బ్లాక్ డీల్ జరిగినందున టాటా మోటర్స్ సుమారు 2 % నష్టపోయింది.
నిఫ్టీ స్టాకు ల లో నేడు హీరో హోండా, DLF 4 % చొప్పున లాభపడ్డాయి. కాగా టాటా మోటర్స్ 2. 3 % , యాక్సిస్ బ్యాంక్ 1.8 % నష్టపోయాయి.