- 31-3-2010
- మార్కెట్ నాడి
అమెరికా మార్కెట్ల లో విడుదల ఐన కన్సుమేర్ కాన్ఫిడెన్సు గణాంకాలు సానుకూలం గా ఉండటం తో , ఆర్ధిక వ్యవస్థ మెరుగు పడుతున్నదన్న అంచనాల తో ,అక్కడి మార్కెట్లు గత రాత్రి లాభాలను ఆర్జించాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా అమెరికా మార్కెట్ల ప్రభావం వలన లాభాల లో పయనిస్తున్నాయి.
ఇతర కీలక అంతర్జాతీయ వార్తలను గమనిస్తే , నిన్న చోటు చేసుకున్న G 20 నేతల సమావేశం లో కూడా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ని పటిష్టం చేసేందుకు గాను 2012 లోపల BASEL -III నియమావళి ని అమలుపరచాలని నిర్ణయించారు . బ్యాంకులు డెరి వేటివ్స్ లో విచక్షణా రహితం గా పాల్గొనటం వలన ప్రస్తుతం ఏర్పడ్డ సంక్షోభాన్ని పునరావృత్తం కాకుండా అరికట్టేందుకు బాసెల్-III నియమావళి అమలుపరచనున్నారు. భారత్ కు కూడా G-20 లో సభ్యత్వం ఉంది కనుక కాపిటల్ మార్కెట్లు , బ్యాంకుల లావా దేవీల లో పారదర్శకత నెలకొల్పే విధం గా మరిన్ని నియమ నిబంధనలను మును ముందు మన మార్కెట్లు ఎదురుకోనున్నాయి .
మన దేశం లో చోటు చేసుకున్న ముఖ్య అంశాల లో , భారత్ ఆర్ధిక వృద్ధి 9 % సాధించటం సునాయాసం కాదని ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జి తేల్చి చెప్పారు. అదే విధం గా ప్రస్తుతం ఇస్తున్న వంట గ్యాస్ , డిజిల్ పై సబ్సిడీ ని ఎత్తివేయాలని ప్రణాళిక సంఘం ప్రభుత్వానికి సూచించటం కూడా మన మార్కెట్లకు కీలకం. ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీ ని పూర్తి గా ఉపసంహరించటం కష్టమే. ఐతే సగానికి పైగా సబ్సిడీ ని తలగించే ఆస్కారం లేకపోలేదు. వంట గ్యాస్ ధర ని పెంచి , సామాన్యుడి కొనుగోలు శక్తి ని తగ్గించి తద్వారా ఇతర వస్తువుల కు గల డిమాండ్ ని తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అరికట్టే విధం గా ప్రణాళిక సంఘం వ్యూహం అయివుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం పై ఒకటి రెండు రోజుల లో విడుదల కానున్న మరిన్ని ప్రకటనలు మార్కేట్లని మరింత గా ప్రభావితం చేయనున్నది.
3G వేలం తాలూకు వార్తలు వెల వడుతున్నదృశ్యా నేడు టెలికాం స్టాకుల లో కొంత చలనం సృష్టించ వచ్చు.
నేడు ఆర్ధిక సంవత్సరపు చివరి రోజు కనుక , ఆదాయపు పన్ను తాలూకు లావాదేవిల నడుమ నేడు ఫండ్ మేనేజర్లు , దేశీయ సంస్థాగత మదుపరులు నేడు మార్కెట్ల లో విస్తృతం గా పాల్గొనే అవకాశం ఉంది కనుక నేటి మార్కెట్ గమనాన్ని ఖచ్చితం గా అంచనా వేయటం కష్టం. నిన్న చోటు చేసుకున్న ప్రాఫిట్ బుకింగ్ కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, నేటి సానుకూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో బుల్ల్స్ బరి లోకి దిగే అవకాశం ఉంది. ఈ కారణాల వలన నేడు మన మార్కెట్లు ఆటు పొట్ల కు గురి అయ్యే సూచనలు ఉన్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:: 17590
- మద్దత్తు స్థాయిలు : 17558-17435-17345
- అవరోధాలు : 17670-17780-17910