• 30-3-2010
  • మార్కెట్ రిపోర్ట్

వరుసగా నాలుగు రోజుల పాటు లాభాలను ఆర్జించిన మన మార్కెట్ల లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవటం తో నష్టాల తో ముగిసాయి. దేనితో నిఫ్టీ 40 పాయింట్ల నష్టం తో 5262 పాయింట్ల వద్ద ముగియగా సెన్సెక్స్ 121 పాయింట్ల నష్టం తో 17590 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో లాభాల తో ప్రారంభమైన సెన్సెక్స్ గరిష్టం గా 17783 పాయింట్ల వరకు ఎగబాకింది. ఐతే మేము ఉదయం సూచించిన అవరోధ స్థాయి ఐన 17780 పాయింట్ల ను చేదించ లేక పోవటం తో లాభార్జన చోటు చేసుకుంది. దీనితో సెన్సెక్స్ కనిష్టం గా 17558 పాయింట్ల వరకు పడిపోయింది. ఇది మేము సూచించిన 17558 మద్దతు స్థాయి కి సరిగ్గా సరిపోవటం విశేషం. చివరకు సెన్సెక్స్ 17590 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.15 % , స్మాల్ క్యాప్ రంగం 0.78 % చొప్పున లాభపడటం విశేషం.

సేక్టరాల్ సూచీ ల లో నేడు రియాలిటి రంగం అత్యధికం గా 1.42 % లాభపడగా, PSU 0.80 % లాభాలను ఆర్జించాయి. కాగా బలహీన పడుతున్న అమెరికా డాలర్ కారణం గా ఐ. టి స్టాకులు భారి నష్టాలను చవిచూడటం తో ఐ. టి. రంగం అత్యధికం గా 2.19 % నష్టపోయింది కాగా టెక్ రంగం 1.62 % మేరకు నష్టపోయాయి.

అంతర్జాతీయ విపణి లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నేడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపనీలు కుదేలుమన్నాయి. ఉక్కు ఖనిజం పై ఎగుమతుల పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించటం తో నేడు NMDC 3.5 % , SESA GOA 0.66 % మేరకు లాభపడ్డాయి. ప్రభుత్వం ప్రకటించిన నిధుల సమీకరణ విధానం సానుకూలం గా ఉండటం వలన నేడు రియాలిటి , బ్యాంకింగ్ రంగం స్టాకులు లాభపడ్డాయి. రియాలిటి స్టాకు లైన IBREAL ESTATE, HDIL UNITECH, DLF మున్నగు స్టాకులు 0.5 % నుండి 3.3 % వరకు లాభపడ్డాయి. మెక్సికో కి చెందిన హోమేక్స్ కంపనీ తో ఒప్పందం ఖరారు కావటం తో పూర్వంకర 2 % ఎగబాకింది. జపాన్ దేశపు హిటాచి నకు TELCON లోని 20 % వాటా ని అమ్మటం తో నేడు టాటా మోటర్స్ 2.25 % లాభపడింది. UK కి చెందిన టెక్నాలజీ సోలుషన్స్ నుండి 200 కోట్ల రూపాయల ఆర్డర్లు దక్కించు కోవటం తో CROMPTON GREAVES 2.32 % లాభపడింది.

సెన్సెక్స్ స్టాకు ల లో DLF 3.23 % ,TATA MOTORS 2.25 % అత్యధికం గా లాభపడగా HDFC BANK 2.98 % ,INFOSYS 2.64 % నష్టపోయింది .