- 30-3-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్ల లో విడుదల ఐన వినియోగదారుల కొనుగోళ్ళ గణాంకాలు వరుసగా ఐదవ నెల లో పెరుగుదల సూచించటం , ఐరోపా మార్కెట్ల లో ఆర్ధిక వ్యవస్థ ఆశాజనకం గా ఉండగలదన్న అంచనాల తో nasdaq , s & p మున్నగు అమెరికా మార్కెట్లు బలపడ్డాయి. దీనితో నేడు ఆసియా మార్కెట్లు కూడా శుభారంభం చేసాయి. ఐతే జపాన్ లో నేడు విడుదల ఐన ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు 11 నెలల తరువాత మొదటి సారిగా తగ్గుదల సూచించాయి. వరుస సెలవల కారణం గా ఫిబ్రవరి ఉత్పత్తి తగ్గిందని అధికారులు వివరణ ఇవ్వటం తో జపాన్ మార్కెట్లు మరల పుంజుకున్నాయి. కాగా నేడు బ్రిటన్, ఫ్రాన్సు దేశాలకి సంబంధించిన GDP గణాంకాలు విడుదల కానున్నాయి. అదే విధం గా నేడు అమెరికా లో కన్సుమేర్ కాన్ఫిడెన్సు గణాంకాలు వెలవడనున్నాయి . ఈ గణాంకాలు తదుపరి ప్రపంచ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం . ఇది ఇలా ఉండగా సింగపూర్ లో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ ఇండెక్స్ ఫ్లాట్ గా ప్రారంభమవ్వటం తో నేడు మన మార్కెట్లు ఇదే పంధాని అనుసరించవచ్చు.
ఇక మన దేశం లో చోటు చేసుకున్న కీలక అంశాలను ప్రస్తావిస్తే, రిటైల్ మార్కెట్ల లో చెక్కర లభ్యం అయ్యే విధం గా , ప్రభుత్వం బిస్కెట్, చాక్లెట్ తయారి దారులను చెక్కర ని దిగుమతి చేసుకోమని సూచించటం తో ప్రపంచ మార్కెట్ల లో చెక్కర ధరలు మరల పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వం చేసిన ప్రకటన వలన BRITTANIA , RAVALGON మున్నగు కంపనీలకు కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. నిన్న రిజర్వు బ్యాంక్ తో చర్చించిన తరువాత, మార్కెట్లు ముగిసిన అనంతరం , బాండ్ మార్కెట్ల నుండి నిధుల సమీకరణ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2010-2011 సంవత్సరానికి అవసరమయ్యే నిధుల లో 63 % సంవత్సరపు పూర్వార్ధం లో నే సమీకరించాలని ,సుమారు 2870 కోట్ల రూపాయలను దీర్ఘ కాలిక బాండ్లు జారి ద్వారా సమీకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే బాండ్ మార్కెట్ల లో ని మదుపరుల వద్ద కోకొల్లలు గా దీర్ఘ కాలిక బాండ్లు ఉండటం వలన ఈ సారి ప్రభుత్వం స్వల్ప కాలీన బాండ్లు జారి చేయగలదన్న మదుపరుల అంచనాలు తారు మారు కావటం తో నేడు బాండ్ మార్కెట్ల లో రేటు పడిపోనున్నది. ఐతే ప్రభుత్వం నిధుల సమీకరణ పూర్వార్ధం లో నే అత్యధికం గా మార్కెట్ల నుండి సమీకరిస్తున్నందున , ఉత్తరార్ధం లో ఆర్ధిక వ్యవస్థ మరింత జోరు అందుకున్నప్పుడు , నిధుల సమీకరణ కి ప్రైవేటు కంపనీలకి అవకాశం ఇచ్చే విధం గా ఉండటం వలన , ప్రభుత్వ విధానం దీర్ఘ కాలిక ప్రయోజనాలకి మేలు చేకూర్చే విధం గా ఉండటం మార్కెట్లకు లాభదాయకం. ( ఐతే , సాధారణం గా రిజర్వు బ్యాంక్ , మార్కెట్ల నుండి ధనాన్ని ఉపసంహరించి , ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విధానం లో కీలక అంశం బాండ్లు విడుదల చేయటం . ఇప్పుడు తాజా ప్రభుత్వ విధానం వలన , రిజర్వు బ్యాంక్ వద్ద ఇటువంటి బాండ్లు దాదాపు లుప్త మయ్యే పరిస్థితి ఏర్పడినందు వలన ఇక రిజర్వు బ్యాంక్ నకు , ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు కీలక వడ్డీ రేటు ని పెంచటం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. కాబట్టి అతి త్వరలో రిజర్వు బ్యాంక్ , కీలక వడ్డీ రేటు ని పెంచటం ఖాయం ! )
ఇక స్టాకు ల పరంగా .. జాయిన్ టెలికాం మధ్య ఒప్పందం నేడు ఖారారు అవ్వగలదని BHARTI AIRTEL కు మరొక షాక్ తగిలింది. ఆఫ్రికా ఖండం లో గబాన్ ప్రభుత్వం , ఈ ఒప్పందం చెల్లదని, ప్రభుత్వ రెగ్యులేటరి నియమాలను ఉల్లంఘనం చేసే విధం గా ఉందని , కాబట్టి అడ్డుకుంటామని ప్రకటించటం తో మరల ఈ ఒప్పందం అయోమయ స్థితి లో పడింది. ఈ కారణం గా నేడు AIRTEL స్క్రిప్ట్ మరొక సారి ఆటుపోట్ల కి గురి అయ్యే అవకాశం ఉంది.
గరిష్ట స్థాయిల ను చేరుకున్న మన మార్కెట్లు పెద్దగా దూకుడు కనపరచ క పోవచ్చు. సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నిలకడ గా పయనిస్తున్న మన మార్కెట్ల లో, ఎటువంటి ప్రతికూల అంశం ఎదురైనా , ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మదుపరులు అప్రమత్తం గా ఉండటం మంచిది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు:: 17711
- మద్దత్తు స్థాయిలు : 17670-17558-17445
- అవరోధాలు : 17780-17910-17990.