- 29-3-2010
- మార్కెట్ రిపోర్ట్
సోమవారం ట్రేడింగ్ ప్రారంభంనుంచీ లాభాల బాటలో పయనిస్తున్న సెన్సెక్స్ ఓ దశలో గరిష్టంగా 145 పాయింట్ల మేరకు లాభపడింది. అయితే తరువాత లాభాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటంతో క్రమంగా 131కు, ఆపై 94 పాయింట్ల వరకు పడిపోయింది. దీంతో ట్రేడింగ్ ముగింపు సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 66.59 పాయింట్ల మేర లాభాలతో 17,711.35 పాయింట్ల వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజీ సూచీ నిఫ్టీ కూడా 20.85 పాయింట్ల లాభంతో 5,302.85 మార్కువద్ద నిలిచింది.బాంబే స్టాక్ ఎక్చేంజీ లాభాలలో హెచ్చుతగ్గులు ఏర్పడినా, మొత్తంమీదా లాభాల బాటలోనే సెన్సెక్స్ పయనించటంవల్ల చాలా కంపెనీలు లాభపడ్డాయి. అలాంటి వాటిలో రుచి ఇన్‌ఫ్రాస్టక్చర్, నోవోపాన్ ఇండ్స్ కంపెనీలు 20 శాతం మేర అత్యధికంగా లాభాలను ఆర్జించాయి. ఆ తరువా టీవీఎస్ ఎలక్ట్రాన్స్, ఐఎస్ఎమ్‌టి లిమిటెడ్, వలేచా ఇంజిన్, గ్లోరీ పోలీ, మైసూర్ సిమెంట్, ఇండో ఆసియన్ ఫస్, టైమ్స్ గార్నిటీ, కంట్రీకండో తదితర కంపెనీలు కూడా లాభపడ్డాయి.అదే విధంగా సోమవారం ట్రేడింగ్ ముగింపు సమయానికల్లా నష్టపోయిన కంపెనీల వివరాలను చూస్తే.. మహ్ అండ్ మహ్ 48 శాతం మేరకు భారీ నష్టాలను చవిచూసింది. ఆ తరువాత బ్లూ బర్డ్, అష్కో ఇండస్, సుజన మెటల్, బిర్లా పవర్, డీసీఎమ్ ఫిన్ సెర్, స్పైస్ లిమిటెడ్, డిగ్జమ్ లిమిటెడ్, లైకా ల్యాబ్స్ తదితర కంపెనీలు నష్టాలను కూడా చవిచూశాయి.