- 3-3-2010
- మార్కెట్ రిపోర్ట్
నేడు వరుసగా మూడవ రోజు లాభాల తో ముగియటం తో మన మార్కెట్ల లో ని బుల్ల్స్ హాట్రిక్ సాధించి నట్లయ్యింది. దీని తో సెన్సెక్స్ నేడు 227 పాయింట్లు ఎగబాకి 17000 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 71పాయింట్ల లాభం తో 5088పాయింట్లవద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ 17000 పాయింట్ల ఎగువగా ముగియటం నేటి ట్రేడింగ్ విశేషం.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.58 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.29 శాతం లాభపడ్డాయి. సేక్టరాల్ సూచీ ల లో నేడు కూడా అన్ని లాభా ల లో ముగియటం విశేషం . నేడు చమురు మరియు గ్యాస్ అత్యధికం గా 2.28 % లాభపడగా రియాలిటీ రంగం 2.16 % ఎగబాకింది.
గత కొన్నిరోజులు గా వెలవడుతున్న సానుకూల సంకేతాలు మన మార్కెట్ ల సెంటిమెంట్ ని బలపరచటం, DMK, త్రినమూల్ కాంగ్రెస్స్ మున్నగు రాజకీయ పార్టీలు పెట్రోల్ ధరల పెంపు ఫై కొంత మెత్తబడటం వంటి అంశాలు మార్కెట్లు లాభాపదేందుకు సహకరించాయి. నేడు విడుదల ఐన hsbc సర్వీసు తాలూకు సూచీ గణాంకాలు 2008 తరువాత గరిష్ట స్థాయి లో నమోదు కావటం మార్కెట్లకు ఊతం అందించింది.
నేడు లిస్టింగ్ జరిగిన ARSS 64 % వృద్ధి సాధించటం విశేషం. UNICHEM LAB నకు EU GMP గుర్తింపు లభించటం తో ఈ కౌంటర్ 6.38 % లాభపడింది సెన్సెక్స్ స్టాకు ల లో నేడు JP ASSOCIATES 5.9 % , TATA POWER 4.7 % లాభపడ్డాయి. కాగా రాన్ బాక్సి 1.9 % , అంబుజ సిమెంట్ 0.9 % నష్టపోయింది .