- ౩-౩-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల తో ముగిసాయి. భారత్ మార్కెట్లు సానుకూల సంకేతాలు పంపటంతోనూ , గ్రీస్ దేశపు ప్రభుత్వం ,అక్కడి ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కేందుకు గాను పటిష్టమైన చర్యలు చేపట్టవచ్చన్న అంచనాల తో అమెరికా మార్కెట్లు , మధ్య మధ్య లో చోటు చేసుకున్న ప్రాఫిట్ బుకింగ్ ని తట్టుకుని ,లాభాల లో ముగిసాయి. అమెరికా మార్కెట్ల సానుకూల ప్రభావం వలన నేడు ఆసియా మార్కెట్లు కూడా శుభారంభం చేసాయి . జపాన్ మరియు ఇతర ఆసియా మార్కెట్లు కూడా స్వల్ప లాభాల తో పయనిస్తున్నాయి.
నిన్నటి ట్రేడింగ్ తదుపరి ప్రపంచ మార్కేట్లకే దిశని అందించిన మన మార్కెట్లు , నేడు మరొక సారి నిన్నటి కథ ని పునరావృత్తం చేసే ప్రయత్నం చేయవచ్చు. బడ్జెట్ లోటు ని తగ్గించే విధం గా భారత్ ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు సంతృప్తి ని వెలుబుచ్చాయి . దీనితో , ఇప్పటి వరకు అతి కనిష్ట స్థాయి లో ఉన్న భారత్ రేటింగ్ bbb - నుండి మెరుగు పడే అవకాశం పెరిగింది. అంతర్జాతీయ రేటింగ్ పెరిగితే మన దేశం లో విదేశీ పెట్టుబడులు మరింత గా పెరుతాయన్న విషయం తెలిసినదే . బడ్జెట్ ప్రస్తావన అనంతరం ప్రముఖ రేటింగ్ సంస్థ మూడి ,మన మార్కెట్లు ప్రస్తుతం వున్న స్థాయి నుండి కనీసం మరో 20 % పెరిగే అవకాశం ఉందని ప్రకటించటం మన మార్కెట్లకు శుభ సూచకం. టెంపుల్ టెన్ అసెట్ మేనేజ్మెంట్ కంపనీ , భారత్ మార్కెట్లు వర్ధమాన మార్కెట్ల లో అతి వేగం గా పెరగనున్నదని జోస్యం చెప్పింది. భారత్ అంతర్జాతీయ రేటింగ్ పెరగనున్నదని , బడ్జెట్ ముందు నుండే ఈ శీర్షిక ద్వారా పదే పదే మేము ప్రస్తావించటం జరిగిందన్న అంశం ఈ సందర్భం లో గమనార్హం . ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షులు మొన్టేక్ సింగ్ ఆహువాలియా సైతం , మన దేశపు రేటింగ్ పెరగనున్నదని ప్రకటించటం , మా విశ్లేషణ ని నిజం చేసినట్లయ్యింది.
స్థిరం గా పెరుగుతున్న మన దేశపు ఉత్పత్తి గణాంకాలు, మెరుగవుతున్న ఎగుమతులు, ఊపందుకున్న వాహనాల అమ్మకాలు మున్నగు సానుకూల అంశాలు ప్రస్తుతం మన మార్కెట్ల సెంటిమెంట్ ని బలోపేతం చేస్తున్నాయి. మార్కెట్లను ప్రభావితం చేసే ఇతర అంశాలను గమనిస్తే , పెంచిన పెట్రోల్ ధరలపై కట్టుబడి ఉంటామని , ధరలు తగ్గించే ప్రసక్తి లేదని ప్రధాన మంత్రి స్పష్టం చేయటం ద్వారా బడ్జెట్ లోటు ని తగ్గించే దిశ గా భారత్ కట్టుబడి ఉందని అంతర్జాతీయ సంస్థలకి సంకేతాలు పంపినట్లయ్యింది. అదే విధం గా గతం లో సంతకం చేసిన అణు శక్తి ఒప్పందం పై కీలక బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు సారాంశం మేరకు , అనుకోని ప్రమాదం సంభవిస్తే అణు కంపనీల భాద్యత కొంత వరకు తగ్గనున్నది. ఈ అంశం కూడా మార్కెట్లకు లాభదాయకం. కాబట్టి రానున్న రోజుల లో మరల అణు శక్తి సంబంధిత స్టాకు ల లో మరొక సారి చలనం కనిపించే అవకాశం ఉంది.
ఈ సానుకూల అంశాల వలన నేడు కూడా మార్కెట్ల లో బుల్ల్స్ తమ పట్టు బిగించే అవకాశం ఉంది. టెక్నికల్ గా నిఫ్టీ అవరోధ స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నందున మధ్య మధ్య లో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఐతే మార్కెట్లు పడినప్పుడల్లా మంచి స్టాకు లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16773
- మదత్తులు : 16666 -16576-16486
- అవరోధాలు : 16894-16963-17054