• 4/3/ 2010
  • మార్కెట్ నాడి
వృద్ధి రేటు ఒక మోస్తరిగా ఉందని అమెరికా ఫెడ్ అధ్యక్షులు బెర్నంకే గత రాత్రి ప్రకటించటం తో అక్కడి మార్కెట్లు ఫ్లాట్ గ ముగిసాయి. ట్రేడింగ్ సమయం లో గడించిన లాభాలు , మార్కెట్ ముగింపు సమయానికి ,అక్కడి మార్కెట్లు నిలబెట్టుకోలేక పోయాయి. అమెరికా మార్కెట్ల ప్రభావం వలన నేడు ఆసియా మార్కెట్లు ఆటుపోట్లని ఎదురుకుంటున్నాయి . ఈ అంశం వలన నేడు కొంత ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకునే దిశగా ఆసియా మార్కెట్లు నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఐతే ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ కురోడ , ఆసియా GDP వృద్ధి 7 % ఉండగలదని అంచనా తెలియచేసారు. ఈ అంశం నేటి ఆసియా మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశం. అదే విధం గా గ్రీస్ దేశం , సంక్షోభం నుండి బయట పడే విధం గా అక్కడి బడ్జెట్ లోటు ని తగ్గించ నున్నట్లు, పెట్రోల్ , మద్యం పై పన్ను వేయనున్నట్లు , ఉద్యోగుల జీతాలను కుదించనున్నట్లు చేసిన ప్రకటన కూడా గ్రీస్ దేశం చిత్త శుద్ధి గా వ్యవహరించ నున్నదని సంకేతాలను తెలియపరిచింది.
ఇక మన దేశానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే, అంతర్జాతీయ రెటింగ్ సంస్థ " నోముర " భారత్ రెటింగ్ ని పెంచటం విశేషం. అదే విధం గా ఆర్ధిక మంత్రి పెట్రోల్ ధరల పెంపు పై మిత్ర పక్షాలను బుజ్జగించటం లో కృతాక్రుత్యులవ్వటం కూడా మార్కెట్లకు శుభ పరిణామం. భారత్ లో స్టీల్ వినియోగం భారీగా పెరగనున్నదని కేంద్ర మంత్రి ప్రకటించటం కూడా స్టీల్ కంపనీల కు లాభదాయకం కానున్నది. ఈ అంశాల వలన నేడు మార్కెట్లు కొంత ఉత్సాహం గా ట్రేడ్ అయ్యే సూచనలు వున్నా నేడు విడుదల కానున్న ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ల దిశని నిర్దేశించే అవకాశం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:17000
  • అవరోధాలు : 17083-17226-17351
  • మద్దత్తు స్థాయిలు : 16963-16894- 16666