• 29-3-2010
  • మార్కెట్ నాడి

గత శుక్రవారం అమెరికా మార్కెట్లు మరొక సారి నష్టాలను నమోదు చేసాయి.అమెరికా లో విడుదల ఐన GDP గణాంకాలు వృద్ధిని నమోదు చేసినప్పటికీ , పేలవం గా , అంచనాల కంటే తక్కువగా ఉండటం తో అక్కడి మార్కెట్లు లాభాలను విసర్జించి నష్టపోయాయి. నేడు ఇతర ఆసియా మార్కెట్లు కూడా లాభాల స్వీకరణ కి గురి అవుతున్నాయి. సింగపూర్ లో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ ఇండెక్స్ కూడా నష్టాల తో ట్రేడ్ అవుతున్నందున నేడు మన మార్కెట్లు బలహీనం గా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

మన మార్కెట్ల విశేషాలు గమనిస్తే, నేడు ప్రభుత్వం , రిజర్వు బ్యాంక్ తో , 2010 -11 సంవత్సరానికి గాను ప్రభుత్వానికి అవసరమయ్యే నిధుల గురించి చర్చించ నున్నది. ఈ సమావేశం లో కీలక వడ్డీ రేటు పై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాబట్టి నేడు రియాలిటి , బ్యాంకింగ్ , ఫైనాన్స్ స్టాకులు లు బలహీనం గా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి. మిశ్రమ మైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు కూడా నష్టాల తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులు మన మార్కెట్ల లో ప్రవహిస్తున్న కారణం గా , క్రమేపి మన మార్కెట్లు కొంత కోలుకునే అవకాశం కూడా లేకపోలేదు. నేడు అప్రమత్త ధోరణి తో మార్కెట్లు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17644
  • మద్దత్తు స్థాయిలు : 17558-17445-17351-17276
  • అవరోధాలు : 17670-17780-17910