• 26-3-2010
  • మార్కెట్ నాడి

తగ్గుతున్న నిరుద్యోగ భత్య లబ్దిదారుల గణాంకాల నేపధ్యం లో గత రాత్రి , అధిక శాతం అమెరికా మార్కెట్లు లాభాల లో పయనించి , ఐరోపా బ్యాంకు ప్రెసిడెంట్ జేయన్ ట్రిచేట్ చేసిన వ్యాఖ్యానం తో కుదేలు మన్నాయి. జేయన్ ట్రిచేట్ , గ్రీస్ సంక్షోభం పై స్పందిస్తూ , గ్రీస్ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధిని ఆశ్రయించటం అత్యంత దురదృష్టకరమని చెప్పటం తో అమెరికా మార్కెట్లు తిరిగి నష్టపోయి ఫ్లాట్ గా ముగిసాయి .అదే విధం గా ట్రేజేరి వేలం కూడా నిస్సత్తువగా సాగటం తో అమెరికా మార్కెట్లు బలహీనపడ్డాయి . ఐతే , అమెరికా మార్కెట్లు ముగిసిన తరువాత , జేయన్ ట్రిచేట్ తానూ చేసిన ప్రకటన ని మీడియా వక్రీకరించిందని , IMF గ్రీస్ కి సహాయం చేయటం తనకు ఆనందంగా ఉందని వివరణ ఇవ్వటం తో నేడు ఆసియా మార్కెట్లు శుభారంభం చేసాయి. అతేన్స్ లో ఐరోపా దేశాలు సమిష్టి గా గ్రీస్ ని కాపాడాలని IMF ని కోరాలని తీర్మానించటం , గ్రీస్ కి పూర్తి సహకారం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసినదే. జర్మనీ కూడా , IMF ఆధ్వర్యం లో సహాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించటం కూడా ఆసియా మార్కెట్ల లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది.

ఇది ఇలా ఉండగా, ఈ వారం EMERGING MARKETS FUND లో అత్యధికం గా పెట్టుబడులు వచ్చాయని సుమారు 1.05 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని EPFR గ్లోబల్ ప్రకటించటం మన మార్కెట్ల తో పాటు ఇతర ఆసియా మార్కెట్ల కు కూడా శుభ సూచకం .

మన మార్కెట్ల పరం గా విశ్లేషిస్తే , రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు కట్టుబడి ఉందని , పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు వడ్డీ రేటు ని పెంచాలని సూచించింది. SBI గృహ నిర్మాణ వడ్డీ రేటుని పెంచబోమని ప్రకటించటం తో RBI వడ్డీ రేటు పై మరొక సారి స్పష్టీకరించింది. అదే విధం గా , ఆహార ద్రవ్యోల్బణం క్రమంగా క్యాపిటల్ గూడ్స్ రంగానికి విస్తరిస్తున్నదని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జీ హెచ్చరించటం కూడా మార్కెట్లకు మునుముందు "CROCODILE FESTIVAL " ఉండగలదని చెప్పకనే చెప్పినట్లయ్యింది. కాబట్టి ఇక మీదట మదుపరులు , మార్కెట్లు పెరిగినప్పుడు తమ పోజిషేన్లను క్రమేపి తగ్గించుకుంటూ పోవటం మంచిది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు:: 17559
  • మద్దత్తు స్థాయిలు : 17445-17351-17276-
  • అవరోధాలు : 17636-17780-17910