• 26-3-2010
  • మార్కెట్ రిపోర్ట్
సానుకూల ఆసియా మార్కట్ల ప్రభావం వలన లాభాల తో ప్రారంభమైన మన మార్కెట్లు ఆద్యంతం లాభాల తో పయనించాయి . పైగా అంతర్జాతీయ పెట్టుబడులు పెరగటం కూడా మన మార్కెట్లకు లాభం చేకూర్చింది . దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 86 పాయింట్లు బలపడి 17645 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 21.60పాయింట్ల లాభం తో 5282 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో 18 నెలల గరిష్ట స్థాయి లో మార్కెట్లు ముగియటం విశేషం.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.71 శాతం, స్మాల్ క్యాప్ రంగం శాతం 0.03 నష్టపోయింది. సేక్టరల్ సూచీ ల లో ఆటో రంగం నేడు అధ్యధికం గా 1.75 % లాభపడింది. కాగా బ్యాంకింగ్ రంగం 1.59 % లాభపడింది . నేడు ఐ. టి రంగం 0.67 %, టెక్ 0.55 % నష్టాల లో అగ్రగామిగా నిలిచాయి.
స్టాకుల పరంగా చర్చిస్తే, టాటా మోటర్స్ తమ సర్విస్ విభాగాన్ని జపాన్ కి చెందిన హిటాచి కి 1000 కోట్ల రూపాయలకి అమ్మటం తో ఈ కౌంటర్ 3.36 % వృద్ధిని నమోదు చేసింది. SUZUKI, MNM మున్నగు ఇతర ఆటో స్టాకులు కూడా సుమారు 2 % లాభపడ్డాయి . విడియో కాన్ మొబైల్ సేవలు ప్రారంభిచటం తో పోటి పెరుగుతున్నందు వలన టెలికాం స్టాకులు నష్టపోయాయి. రూపాయి బలపడటం తో నేడు ఐ. టి స్టాకులు నష్టపోయాయి.కాగా NITIN FIRE అరబ్ సంస్థ ని కొనుగోలు చేయనున్న వార్త వలన 3 % ఎగబాకింది. అణుశక్తి ఉత్పత్తి లో అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించటం తో టాటా పవర్ సుమారు 1 % లాభపడింది. ఎసిలర్ మిట్టల్ అదనం గా 4.9 % వాటాలను కొనుగోలు చేయటం తో ఉత్తం గాల్వ 7.53 % లాభపడింది. కాగా SUVEN LIFE లాభాల స్వీకరణ నేపధ్యం లో 6 % నష్టపోయింది.
ఇక సెన్సెక్స్ స్టాకు ల లో నేడు రిలయన్స్ ఇన్ఫ్రా 1.49 % , DLF 1.3 % నష్టపోగా HUL 2.61 % , TATA MOTORS 3.36 % లాభాలను ఆర్జించాయి.