• 25-3-2010
  • మార్కెట్ రిపోర్ట్
దేశీయ ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడంతో బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి ద్రవ్యోల్బణం ప్రబావంతో 107 పాయింట్లు బలపడింది. ఫలితంగా సెన్సెక్స్ 17,558 మార్కును తాకింది. ఇదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 36 పాయింట్లు బలపడి, 5,260 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది. మార్చి 13తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 16.3 శాతానికి చేరుకుంది. అదే అంతకుమునుపు వారాంతానికి ద్రవ్యోల్బణం రేటు 16.22 శాతంగా ఉండింది. ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం దిశగా ర్యాలీని ముగించింది. ఇకపోతే.. క్యాపిటల్ గూడ్స్ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో భెల్, అల్స్‌స్టోమ్ ప్రాజెక్ట్స్ వంటి సంస్థలు లాభపడ్డాయి. ఇంకా హీరో హోండా, హిందాల్కో, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, జైప్రకాష్ అసోసియేట్స్ వంటి సంస్థలు కూడా లాభాలను ఆర్జించాయి. కానీ ఏసీసీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.12 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం నష్టపోయింది.
సేక్తోరాల్ సూచీ ల లో క్యాపిటల్ గూడ్స్ రంగం అత్యధికం గా 1.09 శాతం లాభ పడగా , హెల్త్ కేర్ రంగం 0.94 శాతం లాభాలను అర్జించింది. కాగా psu రంగం 0.82 % నష్టపోయింది.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు ACC 2.44 %, TATA MOTORS 1.87 % అత్యధికం గా నష్టపోగా , హీరో హోండా 4.39 % , హిందాల్కో 3.79 % మేరకు లాభపడ్డాయి.