• 25-3-2010

  • మార్కెట్ నాడి

శ్రీరామ నవమి సందర్భంగా నిన్న సెలవ తీసుకున్న మన మార్కెట్లు నేడు గడిచిన రెండు రోజుల ప్రపంచ మార్కెట్ల గమనాన్ని ఒక్కసారిగా నేటి ట్రేడింగ్ లో బేరీజు వేయనున్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. అమెరికా బాండ్ల పట్ల తగ్గుతున్న ఆదరణ, పోర్చుగల్ దేశానికి అంతర్జాతీయ రేటింగ్ తగ్గటం మున్నగు అంశాలు అమెరికా మార్కెట్లను విస్మయపరిచాయి. ఈ ప్రభావంవలన నేడు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల తో ప్రారంభమయ్యాయి. ఐతే నిన్న జపాన్ దేశపు ఎగుమతుల గణాంకాలు గడిచిన 30 సంవత్సరాల లో గరిష్ట స్థాయి లో నమోదు కావటం తో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటున్నదని సంకేతాలు వెలవడటం విశేషం. ఐతే చైనా దేశం లో అసెట్ బుడగ ఏర్పడ నున్నదని, ముందుగా రియల్ ఎస్టేట్ , ఆ తరువాత స్టాకుల లో బుడగ ప్రభావం చూపించగలదని బార్క్లేయ్ సంస్థ జ్యోస్యం చెప్పింది. కాగా ఐరోపా మార్కెట్ల లో , గ్రీస్ సంక్షోభం కారణం గా యూరో మరింత గా బలహీన పడుతోంది. గ్రీస్ దేశానికి ఆర్ధిక సహాయం చేస్తే , ఆ దేశం తిరిగి చెల్లించే పరిస్థితి లో లేదని జర్మనీ, ఫ్రాన్స్ అంచనాలు వేయటం తో ,ఇప్పుడు గ్రీస్ దేశం తమను కాపాడమని అంతర్జాతీయ ద్రవ్య నిధిని ఆశ్రయించనున్నది. ఇది ఇలా ఉండగా, పోర్చుగల్ దేశం కూడా అంతర్జాతీయ రేటింగ్ లో క్షీణత ని నమోదు చేయటం ఐరోపా మార్కెట్లను, తద్వారా మధ్యాన్నం తదుపరి మన మార్కెట్లను బలహీనపరిచే విధం గా ఉంది.

ఇక మన దేశం లోచోటు చేసుకున్న కీలక అంశాలను పరిశీలిస్తే, రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటు ని పెంచటం తో పాటు , త్వరలో ఉద్దేపనల ఉపసంహరణ కి మార్గ దర్శికాలు ప్రకటించగలదని , పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు , పెరుగుతున్న డిమాండ్ ని క్రమబద్దికరించేందుకు ఇది అత్యంత ఆవశ్యకమని రిజర్వు బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బ రావు ప్రకటించటం తో మార్కెట్లు కొంత నిరుత్సాహ పడే అవకాశం ఉంది. పైగా గడిచిన నెల లో మన దేశాపు ఎగుమతులు ప్రతి వృద్ధిని సాధించటం కూడా కొంత శోచనీయ అంశం . ఆయిల్ మార్కెటింగ్ కంపనీలకి ఊరట కలిగించే విధం గా పెట్రో వడ్డన కి మరొక సారి ప్రభుత్వం సిద్ధం కావటం కూడా ద్రవ్యోల్బణాన్ని మరింత గా పెంచే అవకాశం ఉంది. ఈ నేపధ్యం లో నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి.

ఈ అంశాలు నేడు మన మార్కెట్లను కొంత బలహీన పరిచే అవకాశం ఉంది. పైగా నిన్న సింగపూర్ లో ట్రేడ్ అయిన నిఫ్టీ కూడా నష్టాలను నమోదు చేయటం కూడా మన మార్కెట్లకు ప్రతికూల అంశం.

ఐతే నేడు మార్చ్ తాకులు డిరివెటివ్స్ F & O ముగింపు సందర్భం గా మార్కెట్లు ప్రధానం గా రోల్ ఓవర్ల పై ఆధార పడనున్నాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ల పోకడల కంటే కూడా , F & O పొజిషన్ల రోల్ ఓవర్లే మార్కెట్లను అధికం గా ప్రభావితం చేయనున్నది. కాబట్టి నేటి మార్కెట్ గమనం అంచనాలకి అంతు చిక్కకుండా తనదైన శైలి లో చరించే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • · గత ముగింపు:: 17451
  • మద్దత్తు స్థాయిలు : 17351-17276-17180
  • అవరోధాలు : 17464-17636-17780-17910