• 22-3-2010
  • మార్కెట్ రిపోర్ట్

ఉదయం మేము సూచించిన విధం గా , మా అంచనాలను నిజం చేస్తూ మన మార్కెట్లు ఆద్యంతం నష్టాల లో పయనించాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 167.6 పాయింట్లు కోల్పోయి 17410.5 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 57.5 పాయింట్ల నష్టం తో 5205 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.05 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.85 శాతం చొప్పున నష్టపోయాయి. సేక్టోరల్ ఇండెక్స్ లో నేడు హెల్త్ కారే రంగం మినహా మిగిలిన సూచీలన్ని కూడా భల్లుకాల బారిన పడ్డాయి. హెల్త్ కేర్ రంగం 0.26 లాభాలను ఆర్జించగా , రియాలిటి రంగం 3.88 % , మెటల్స్ 1.96 % నష్టపోయాయి.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం రెండు మాసాల లో తగ్గవచ్చని ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మొన్టేక్ సింగ్ ఆహువాలియా, రిజర్వు బ్యాంక్ డిప్యూటి గవర్నర్ చక్రబర్తి చేసిన ప్రకటనలు మన మార్కెట్ల లో నేడు ఎటువంటి సానుకూల ప్రభావం చూపలేక పోయాయి. దీనితో నేటి ట్రేడింగ్ లో స్టాకులు భారిగా నష్ట పోయాయి.

నేటి ట్రేడింగ్ లో రియాలిటి స్టాకులు ఐన akruti, HDIL, DLF, UNITECH, PARSVANATH, IB REAL ESTATE మున్నగు అగ్రగామి వాటాలు సుమారు 2 % నుండి 7 % వరకు నష్టాలను నమోదు చేసాయి. మెటల్ స్టాకులైన TATA STEEL, NALCO, STERLITE, HINDALCO కూడా 1 % నుండి 4 % మేరకు నష్టపోయాయి .టాటా మోటర్స్ , నానో అమ్మకం దారులకు నష్ట పరిహారం ప్యాకేజి ఖారారు చేయటం తో 3 % నష్టపోయింది. కాగా ఇతర మోటర్ కంపనీలైన మారుతి సుజికి 2.2 % , MNM 2.8 % మేరకు నష్టపోయాయి.

వెన్జువెల దేశం లో ఆయిల్ బావుల లో పెట్టుబడి కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తో ONGC 0.37 % లబ్ది పొందగా , రిలయన్స్ అదే దేశం లో ఇతర ఉత్పత్తి దారుల తో చేతులు కలపటం తో 1.46 % నష్టపోయింది. నేడు బ్యాంకింగ్ స్టాకులు కూడా సుమారు 1 .5 % నష్టపోయాయి. రక్షణ శాఖ నుండి 977 కోట్ల ఆర్డర్ పొందినప్పటికీ నేడు LNT 0.22 % నష్టపోయింది . 3G వేలం తాలూకు అంచనాల తో నేడు RCOM 2% , AIRTEL 1.4 % లాభపడింది. ఈ కారణం గా అయిర్ టెల్ కువైట్ దేశపు జాయిన్ టెలికాం తో ఆఫ్రికా లోని కార్యకలాపాలను కొనుగోలు కై జరిగిన ప్రతికూల ఒప్పందాన్ని సైతం మార్కెట్లు లెక్క చేయలేదు. ఐతే INDIA HOTELS దక్షిణ ఆఫ్రికా లో కార్యకలాపాలను ప్రారంభించాలని యోచన వున్నదని ప్రకటించగానే ఈ కౌంటర్ సుమారు 2 % నష్టపోయింది. గ్యాస్ ధరను ఢిల్లీ ప్రాంతం లో కే జి పై 50 పైసలు ధరని పెంచటం వలన IGL 1.22 % లాభపడింది. రెండు పెటంట్లను ఫైలింగ్ చేయటం తో TRANSGENE BIOTECK 5 % ఎగబాకింది.

ఇక సెన్సెక్స్ స్తాకులను పరిశీలిస్తే RCOM , BHARTI AIRTEL 1.88%, 1.43 % చొప్పున లాభపడగా, జై ప్రకాష్ 4.34 % , DLF 3.61 % చొప్పున అత్యధికం గా నష్టపోయాయి.