-
22-2-2010
-
మార్కెట్ నాడి
గత శుక్రవారం భారత్ దేశ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటు ని పెంచే సరికి , మన మార్కెట్ల కన్నా ఇతర ప్రపంచ మార్కెట్లు బెంబేలెత్తి పోయాయి. ఈ కారణం గా నేడు ఆసియా మార్కెట్లు అత్యంత బలహీనం గా ప్రారంభమయ్యాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు కూడా నష్టాల తో ముగియటం గమనార్హం. అమెరికా బాండ్ మార్కెట్ల లో ప్రెసిడెంట్ ఒబామా పట్ల విశ్వాసం సన్నగిల్లటం , ఒబామా వద్ద కన్నా వారెన్ బఫ్ఫెట్ వద్ద తమ నిధులు క్షేమంగా ఉంటాయని బాండ్ మార్కెట్ల ట్రేడర్లు అభిప్రాయపడటం మున్నగు పరిణామాలు అమెరికా మార్కెట్లను కొంత బలహీన పరిచాయి. కాగా అమెరికా బాండ్ మార్కెట్ల కు గల అత్యుత్తమ AAA రెటింగ్ కోల్పోయే ప్రమాదమున్నదని అంతర్జాతీయ రెటింగ్ సంస్థలు అనుమానాలు బ్వ్యక్త పరుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధమ MD జాన్ లిప్స్కి ,అభివృద్ధి చెందిన దేశాలు బడ్జెట్ లోటు ని ఎదుర్కునేందుకు తీవ్ర కష్టాలను ఎదురుకోనున్నాయి జోస్యం చెప్పటం కూడా నేడు ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ ని బలహీన పరిచే విధం గా వున్నది. కాగా ఐరోపా దేశాల మధ్య గ్రీస్ దేశానికి అందించ వలసిన సహాయం పై ఏకాభిప్రాయం కుదరనందున ఐరోపా మార్కెట్లు సైతం నేడు సందిగ్ధం లో ఉండనున్నాయి.
కాగా భారత్ కీలక వడ్డీ రేటు ని పెంచే సరికి, ఇతర దేశాలు కూడా ఇదే విధం గా వడ్డీ రేటుని పెంచవచ్చన్న ఆందోళన తో ఇతర ఆసియా మార్కెట్లు నేడు నష్టాల తో ప్రారంభమయ్యాయి .
ఈ నేపధ్యం లో నేడు మన మార్కెట్లు రెట్టింపు నష్టాలను ఎదురుకునే పరిస్థితి ఏర్పడింది. రిజర్వు బ్యాంక్ ఏప్రిల్ మాసం లో వడ్డీ రేటు ని మరింత గా పెంచే ఆస్కారం ఉన్నందున నేడు మన మార్కెట్ల సెంటిమెంట్ బలహీనం గా ఉండనున్నది. కాగా ఇప్పటివరకు ఈ నెల లో భారి లాభాలను ఆర్జించిన మన మార్కెట్ల లో , ఈ కారణం గా దిద్దుబాటు కి గురి అయ్యే సూచనలు ఉన్నాయి.
కీలక వడ్డీ రేటు పెరగటం తో ఆటో, రియల్ ఎస్టేట్ రంగాల స్టాకులు ప్రతికూలం గా ప్రభావితం అయ్యే ఆస్కారాలు ఉన్నాయి కనుక మదుపరులు ఈ రంగాల నుండి తప్పుకోవటం మంచిది.
స్టాకుల పరంగా భారతి ఎయిర్ టెల్ , కువైట్ కి చెందిన జయిన్ టెలికాం తాలూకు ఆఫ్రికా వ్యాపారాన్ని కొనుగోలు చేయటం ఖరారు కావటం వలన భారతి ఎయిర్ టెల్ నకు సమీప కాలం లాభాల కు గండి పడే అవకాశం ఉంది. కాబట్టి నేడు ఈ కౌంటర్ వత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది.
-
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
-
· గత ముగింపు:: 17578
-
మద్దత్తు స్థాయిలు : 17445-17351-17276-17180
-
అవరోధాలు : 17636-17780-17910
-