- 23-3-2010
- మార్కెట్ నాడి
అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అమెరికా ప్రజలందరికీ ఆరోగ్య బీమా పధకాన్ని అమలు చేసేందుకు బిల్ పాస్ చేయటం తో గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. ముఖ్యం గా హెల్త్ కేర్ స్టాకులు, ఫార్మ రంగానికి చెందిన స్టాకులు బలపడ్డాయి. భారత దేశపు రిజర్వు బ్యాంక్ పెంచిన వడ్డీ పై అతి గా ప్రతిక్రియ చూపాయన్న వాదన తో నిన్న నష్టపోయిన ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా పయనిస్తున్నాయి. ఐతే గ్రీస్ దేశం లో నెలకొని ఉన్న సంక్షోభం మరింత గా జటిలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐరోపా సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ జేయన్ ట్రికేట్ , ఎట్టి పరిస్థితి లోను గ్రీస్ దేశానికి స్వల్ప వడ్డీ కే రుణాలు ఇచ్చేది లేదని ఖరాఖండి గా చెప్పటం ప్రపంచ మార్కెట్లను అయోమయ స్థితి లో పడివేసే విధం గా ఉంది.
ఇక మన దేశ పరిస్థితి ని విశ్లేషిస్తే, రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటు ని పెంచటం సబబే అని, ఇది సరి ఐన సమయం లో తీసుకున్న నిర్ణయం అని , మరింత ఆలస్యం చేస్తే ప్రమాదమున్నదని గవర్నర్ సుబ్బా రావు చెప్పటం తో గోల్డ్మన్ సాచ్ సంస్థ అభిప్రాయాన్ని ఖండించినట్లయ్యింది. గోల్డ్మన్ సాచ్ సంస్థ , వడ్డీ రేటు విషయం లో భారత ఆలస్యం చేసిందని చెప్పటం తో అయోమయ పరిస్థితి నెలకొని ఉండింది.
కాగా భారత దేశ అభివృద్ధి గణనీయం గా ఉండగలదని, 457 లక్షల కోట్ల రూపాయలను ఈ ఆర్ధిక సంవత్సర ప్రధమ భాగం లో మార్కెట్ల నుండి సమీకరించ నున్నట్లు ఆర్టిక మంత్రి ప్రకటించటం మార్కెట్లకు శుభ సూచకం.
నేడు మార్కెట్ల లో నెలకొని ఉన్న మిశ్రమ వార్తల నేపధ్యం లో మన మార్కెట్లు ఎటు తేల్చుకోలేని పరిస్థితి లో ఆటు పొట్ల కి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. ఐతే ప్రారంభం కొంత లాభం తో చేసే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- · గత ముగింపు:: 17410
- మద్దత్తు స్థాయిలు : 17351-17276-17180
- అవరోధాలు : 17445-17636-17780-17910