• మార్కెట్ ముందుచూపు
  • 22-3 -2010 నుండి 26 -3-2010 వరకు
మన మార్కెట్లు గత వారం స్థిరంగా పయనించి లాభాల తో ముగిసాయి. గత వారం ఇదే శీర్షిక లో మేము ప్రస్తావించిన విధం గా , సెన్సెక్స్17061 పాయింట్ల వద్ద మద్దత్తు తీసుకుని గరిష్టం గా17601 పాయింట్ల వరకు ఎగబాకింది. గత వారం సెన్సెక్స్ 17578 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ మదుపరుల కొనుగోళ్ళ మద్దత్తు మన మార్కెట్లను నిలకడగా పయనింప చేసాయి. అంతర్జాతీయ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ మన దేశపు రేటింగ్ పెంచటం మన మార్కెట్లకు కలిసొచ్చింది. దీనితో మన మార్కెట్లు గత వారం సుమారు 2.5 % మేరకు వృద్ధిని నమోదు చేసాయి. ఇక వచ్చే ట్రేడింగ్ రోజుల గురించి అంచనాలను చర్చిస్తే, వారం మధ్య లో శ్రిరామ నవమి పండగ సందర్భం గా మార్కెట్లకు సెలవు. కారణం గా మార్కెట్లు కేవలం నాలుగు రోజులు మాత్రమె ట్రేడ్ కానున్నాయి. కాగా గురువారం F & O ముగింపు కూడా మార్కెట్ల కి అత్యంత కీలక అంశం . ఆర్ధిక సంవత్సరం లో చోటుచేసుకోనున్న చివరి డిరివెటిస్ ముగింపు కారణం గా , సారి సంస్థాగత మదుపరులు టాక్స్ అంశాన్ని దృష్టి లో పెట్టుకొని అమ్మకం పట్ల ఆసక్తి కనపరచ వచ్చు . కాగా గత శుక్రవారం రిజర్వు బ్యాంక్ రిపో మరియు రివర్స్ రిపో వడ్డీ రేటు ని 25 బేసిస్ పాయింట్ల మేరకు పెంచటం కూడా మార్కెట్లకు ప్రతికూల అంశం . కారణం గా వడ్డీ రేటు పై ఆధారపడే బ్యాంకింగ్, ఆటో ,రియల్ ఎస్టేట్ స్టాకులు కొంత వత్తిడిని ఎదుర్కునే ఆస్కారం ఉంది. ఐతే ఏప్రిల్ 20 చోటు చేసుకోనున్న రిజర్వు బ్యాంక్ వార్షిక ద్రవ్య పరపతి విధానం లో వడ్డీ రేటుని మరింత గా పెంచే ఆస్కారాలు కూడా ఉండటం తో మార్కెట్లు అంశాన్ని డిస్కౌంట్ చేసే ప్రయత్నం లో కోల్పోయే అవకాశం ఉంది. గత మూడు ట్రేడింగ్ రోజుల లో కూడా మార్కెట్లు పైకి ఎగబాక లేక పోవటం కూడా బలహీన పరిచే విధం గా ఉంది. ఐతే కంపనీల ముందస్తు పన్ను గణాంకాలు సానుకూలం గా వెలవడుతున్నందున స్టాకుల పరంగా మార్కెట్లు కొంత ముందంజ వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారం మార్కెట్ల లో బుల్ల్స్ మరియు బేర్ల మధ్య ఆసక్తి కరమైన పోరు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు కూడా మన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది . ఐరోపా మార్కెట్ల ను గ్రీస్ దేశం ఇచ్చిన అల్టిమేటం గడువు వారం ముగియనున్నది. ఐరోపా దేశాలు సానుకూలం గా స్పందించక పొతే ప్రపంచ వ్యాప్తం గా స్టాక్ మార్కెట్లు , ముఖ్యం గా బ్యాంకింగ్ స్టాకులు చావు దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి వారం అనుభవం లేని వారు బ్యాంకింగ్ రంగానికి చెందిన స్తాకులకు దూరం గా ఉండటం మంచిది. ఇక టెక్నికల్ గా పరిశీలిస్తే నిఫ్టీ 5170 పాయింట్ల కంటే ఎగువ ట్రేడ్ అవుతున్నంత కాలం మార్కెట్ల లో బలహీనత లేదనే చెప్పాలి. కాగా 5100 పాయింట్ల కంటే దిగువన మార్కెట్ల పై భల్లూకాలు ( BEARS ) తమ ఆధిపత్యం చాట నున్నాయి. F & O ముగింపు కారణం గా చోటు చేసుకునే షార్ట్ కవేరింగ్ లో నిఫ్టీ 5400 పాయింట్ల వరకు ఎగబాకినా ఆశ్చర్య పోవలసిన పనిలేదు .కాబట్టి ట్రేడర్లు అప్రమత్తం గా ఉండటం మంచిది. 5325 -5365 మధ్య నిఫ్టీ కి గట్టి అవరోధం ఉంది. నిఫ్టీ కి స్వల్ప కాల చలన సగటు 5060 పాయింట్లు కాగా మధ్యమ కాల చలన సగటు 5020 పాయింట్లు , మార్కెట్లు బలహీన పడితే కీలక పాత్ర పోషించ నున్నాయి. సెన్సెక్స్ పరం గా 17270-17350 కీలక మద్దత్తు స్థాయిలు కాగా 17780 -17910 వద్ద సెన్సెక్స్ గట్టి అవరోధం ఎదురుకోనున్నది