• 19-3-2010
  • మార్కెట్ రిపోర్ట్
ఉదయం నుండి దిశా హీనం గా పయనించిన మార్కెట్లు , ఐరోపా మార్కెట్ల సానుకూల ప్రభావం వలన చివరికి స్వల్ప లాభాల తో ముగిసాయి. దీనితో సెన్సెక్స్ 59 పాయింట్ల లాభం తో 17578 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 17పాయింట్లు ఎగబాకి 5263 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.07 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.37 శాతం లాభపడ్డాయి. సేక్టోరల్ సూచీ లో నేడు . టి రంగం, రియాలిటి రంగం మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. రంగాలు మాత్రం 0.45 % , 0.95 % చొప్పున నష్టపోయాయి. నేటి ట్రేడింగ్ లో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ అత్యధికం గా 1.09 శాతం ఎగబాకింది. కాగా చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ కూడా 0.78 % వృద్ధిని నమోదు చేసింది. . కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 8 % కరువు భత్యం ప్రకటించటం తో కన్సుమేర్ డ్యురబుల్ రంగానికి చెందిన స్టాకులు లాభపడ్డాయి. TITAN ,TATA MOTORS, HEROHONDA, VIDEOCON , MARUTI మున్నగు స్టాకులు 0.5 % నుండి 2 % వరకు లాభపడ్డాయి. 3G సేవలకు బిడ్ దాఖలు చేయటం తో అయిర్ టెల్, RCOM ,IDEA, TTML మున్నగు టెలికాం స్టాకులు భారి వృద్ధిని సాధించాయి. బ్యాంకింగ్ రంగం లో ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభపడగా, ప్రైవేటు బ్యాంకులు స్వల్పం గా నష్టపోయాయి. స్టాకు వారిగా విశేషాలను గమనిస్తే , రీడ్ & టైలర్ ని లిస్టింగ్ గావించి $ 125 బిలి యన్లను సమీకరించాలని ప్రకటించటం తో SKUMAR NATION 20 % ఎగబాకింది . 32 కొత్త ఆసుపత్రులను రాగల 2 సంవత్సరాల లో నిర్మించ నున్నట్లు ప్రకటించటం వలన APOLLO HOSPITAL 3.27 % లాభపడింది . రైట్స్ ఇష్సు జారి చేయనున్నట్లు ప్రకటించటం తో WINTAC 5% ఎగబాకింది. కంపని బోర్డ్ 1 : 1 నిష్పత్తి లో బోనస్ ప్రకటించటం తో మనప్పురం 3.23 % లాభపడింది .బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో చోటు చేసుకున్న నాలుగు బ్లాక్ డీల్స్ కారణం గా AMTEK AUTO 2.51 % కోల్పోయింది . హై బి . పి నియంత్రించే మందునకు USFDA అనుమతి పొందటం తో GLEN MARK 1.36% లాభపడింది నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ స్టాకు లో HDFC 1.55 % ,DLF 1.36 % చొప్పున అత్యధికం గా నష్టాలను చవిచూసాయి. కాగా ముందు చర్చించిన కారణం గా భారతి అయిర్ టెల్ అత్యధికంగా 3.95 % ,RCOM 1.98 % ఎగబాకాయి