- 2-3-2010
- మార్కెట్ రిపోర్ట్
మూడు రోజుల వరుస సెలవల తరువాత నేడు పునః ప్రారంభమైన మార్కెట్లు , మా అంచనాలకి అనుగుణం గా ఆద్యంతం లాభాల లో పయనించాయి . దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 343 పాయింట్లు లాభపడి గరిష్టం గా 16772 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ పాయింట్లు 94.7 ఎగబాకి 5017 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 2.2 శాతం, స్మాల్ క్యాప్ రంగం 2.33 శాతం లాభపడ్డాయి.
సేక్టోరల్ సూచీ లు అన్ని కూడా నేడు లాభపడటం విశేషం . నేటి ట్రేడింగ్ లో ఆటో రంగం శరవేగం తో 4.29 శాతం దూసుకుపోవటం విశేషం . ఫిబ్రవరి మాసపు ఆటో అమ్మకాల గణాంకాలు అద్భుతం గా ఉండటం తో ఈ స్టాకులు భారి లాభాలను ఆర్జించాయి. మా అంచనాలకు అనుగుణం గా నేడు మెటల్స్ స్టాకులు కూడా , ముఖ్యం గా స్టీల్ స్టాకులు అద్భుతం గా రానించాయి . మెటల్స్ సూచీ నేడు ౩.92 % లాభపడింది.
స్టాకు ల పరం గా నేడు USFDA నుండి డేస్లోరటైడిన్ టాబ్లెట్ల కు ఆమోదం లభించటం తో ORCHID PHARMA 3.59 % లాభపడింది. ఎక్సైజ్ సుంకం పెంచటం తో నేడు ఆయిల్ మార్కెటింగ్ కంపనీలైన BPCL , HPCL ఇత్యాదులు సుమారు 2 % క్షీణించాయి. ముందుగా చర్చించినట్లు ఆటో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నందున నేడు టాటా మోటర్స్ , MNM , బజాజ్ ఆటో , హీరో హోండా , అశోక్ లే ల్యాండ్ వృద్ధిని నమోదు చేసాయి. కాగా నూతన బిల్డింగ్ ల పై 10% పన్ను భారం అదనం గా పెరగ నున్నందున నేడు రియల్ ఎస్టేట్ స్టాకు లైన DLF ,ANSAL PROPERTIES , SHOBHA DEVELOPERS మొదలైనవి సుమారు 1.5 % నష్టపోయాయి. ప్రతి బస్తా పై సుమారు 10 నుండి 12 రూపాయల వరకు ధరలను పెంచు తున్నందుననేడు సిమెంట్ స్టాకులు బలపడ్డాయి. ACC 4.57 % , INDIA CEMENTS 2.68 % లాభపడ్డాయి . మా అంచనాలకి అనుగుణం గా నేడు టాటా స్టీల్, సెయిల్ , హిందాల్కో, స్టర్ లైట్ మున్నగు మెటల్స్ స్టాకులు సుమారు 7 % నుండి 4 % లాభాలను ఆర్జించాయి
నిఫ్టీ స్టాకు ల లో నేడు టాటా మోటర్స్ అత్యధికం గా 13.4 % లాభపడగా , టాటా స్టీల్ 6.2 % ఎగబాకింది. BPCL 4.1 % , DLF 1.9 % మేరకు నష్టాలను చవిచూసాయి.