• 2-3-2010
  • మార్కెట్ నాడి

సానుకూల బడ్జెట్ , సుదీర్ఘ వారంతం అనంతరం నేడు మన మార్కెట్లు మరొక సారి ట్రేడ్ కానున్నాయి . గత రెండు రోజులు గా ప్రపంచ మార్కెట్లు లాభాల బాట లో నడవటం తో నేడు మన మార్కెట్ల లోని బుల్ల్స్ నకు ఓవర్ టైం చేసి , ప్రపంచ మార్కెట్లకు అనుసంధానం గా లాభా ల లో పయనించే పరిస్థితి ఉంది. బడ్జెట్ తదుపరి నేడు మొదటి సారిగా మార్కెట్లు ట్రేడ్ అవుతున్నందు వలన బడ్జెట్ వలన లాభ పొందే స్టాకుల పట్ల మదుపరులు నేడు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

దేశీయ ఉత్పత్తి రంగం కూడా 20 నెలల గరిష్ట స్థాయి నమోదు చేయటం మన మార్కెట్లకి మరింత ఊతం ఇవ్వనున్నది .. బడ్జెట్ లో ఇన్ఫ్రా రంగానికి ఇచ్చిన చేయూత వలన , లండన్ మెటల్స్ ఎక్స్చేంజ్ లో ఉక్కు, రాగి , జింక్ మున్నగు లోహాలు ఎగబాకటం వలనా నేడు మెటల్ ఇండెక్స్ లాభపడే అవకాశం ఉంది. ముఖ్యం గా నేడు స్టీల్ కంపనీల వాటా ల లో కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది.

ఐతే నేడు మార్కెట్ల లో BEARS పక్షాన సెన్సెక్స్ పెద్ద బాబు రిలయన్స్ నిలిచే అవకాశం ఉంది. రిలయన్స్ , విదేశీ సంస్థ అయిన ల్యోన్దేల్ బాసెల్ ని కొనుగోలు కై చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇప్పటికే రిలయన్స్ ఈ సంస్థ కొనుగోలు కై అత్యధికం గా $ 14.5 బిలియేన్ మేరకు బిడ్ దాఖలు చేసిన విషయం విదితమే . కొనుగోలు కై మరింత గా బిడ్ ధర ని రిలయన్స్ పెంచటం అసమంజసం అవుతుంది. ఈ అంశం వలన రిలయన్స్ కౌంటర్ , తద్వారా సెన్సెక్స్ లో కొంత బలహీనత కనిపించే అవకాశం ఉంది. కాబట్టి నేటి ట్రేడింగ్ లో ఇండెక్స్ ట్రేడర్లు అప్రమత్తం గా ఉండటం మంచిది.

అంతర్జాతీయ మార్కెట్లు గత రెండు రోజులు గా లాభపడ్డాయి. అమెరికా లో నిన్న విడు దల అయిన వినియోగదారుల కొనుగోళ్ళ గణాంకాలు అనూహ్యం గా పెరగటం , జపాన్ లో నిరుద్యోగ గణాంకాలు తగ్గటం వంటి అంశాలు మార్కెట్ల సెంటిమెంట్ ని బలపరిచే విధం గా ఉన్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16430
  • అవరోధాలు: 16486-16576-16666
  • మద్దత్తులు:16340-16286-16191