• 17-3-2010
  • మార్కెట్ నాడి
సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో గ్యాప్ అప్ తో శుభారంభం చేసిన మన మార్కెట్లు , మా అంచనాలకి అనుగుణం గా గరిష్ట స్థాయి లో లాభాల స్వీకరణ కి గురయ్యాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్ష్చెంజ్ సూచీ సెన్సెక్స్ 107 పాయింట్ల లాభం తో 17490 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. కాగా నిఫ్టీ 33 పాయింట్ల లాభం తో 5232 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో నిఫ్టీ 5200 పాయింట్ల ఎగువన ముగియటం విశేషం.
నేడు మిడ్ క్యాప్ రంగం 0.17 శాతం లాభపడగా , స్మాల్ క్యాప్ రంగం 0.14 శాతం నష్టపోయింది.
సేక్టోరల్ సూచీ ల లో నేడు PSU సూచీ అత్యధికం గా 2.04 శాతం లాభపడగా, హెల్త్ కేర్ రంగం కూడా1.66 శాతం మేరకు ఎగబాకింది. కాగా కీలక వడ్డీ రేటు పై ఆధారపడ్డ ఆటో రంగం 0.42 శాతం, రియాలిటీ రంగం 0.64 శాతం చొప్పున నష్టపోయాయి.
నేటి స్టాకుల విశేషాలు ముచ్చటిస్తే , ONGC నుండి 1000 కోట్ల ప్రాజెక్ట్ దక్కించుకున్నందున LNT 1.62 % లాభపడింది. అదే విధం గా STEEL STRIPS , ఫ్రాన్సు దేశపు రెనాల్ట్ నుండి ఆర్డర్లు సంపాదించటం తో 6 % ఎగబాకింది.
DOT నిర్వహించిన స్పెషల్ ఆడిట్ లో అంతా సవ్యం గా ఉన్నదని తేలటం తో నేడు IDEA CELLULAR 3 % లాభపడింది .నేడు మెటల్స్ రంగానికి చెందిన స్టాకులు కూడా లాభపడ్డాయి. ఉక్కు ధరలను పెంచ నున్నందుకు గాను JSW STEEL 2% లాభపడింది. కాగా NALCO 2.3 % ఎగబాకింది. నేడు అరంగేట్రం చేసిన ROSSEL TEA, COROMANDAL ENGG 20 % గరిష్ట పరిమితి చేరుకున్నాయి. జపాన్ ఇమేజ్ కార్పరేషన్ తో ఒప్పందం కుదుర్చుకోవడం తో రిలయన్స్ మీడియా వర్క్స్ 1.36 % లాభపడింది.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు HINDALCO అత్యధికం గా 2.33 % , ICICI 1.97 % లాభపడ్డాయి. కాగా చిన్ని కార్ల సెగ్మెంట్ లో పెరుగుతున్న పోటి నేపధ్యం లో మారుతి 1.73 % నష్టపోయింది. కాగా HUL 1.28 % కోల్పోయింది.