- 16-3-2010
- మార్కెట్ రిపోర్ట్
సానుకూల ఐరోపా మార్కెట్ల ప్రభావం వలనా అప్పటివరకు ఆటుపోట్లకు ఎదురుకున్న మార్కెట్లు , మధ్యాన్నం తదుపరి షార్ట్ కవేరింగ్ నేపధ్యం లో భారి గా లాభపడ్డాయి .దీని తో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 218 పాయింట్లు లాభపడి 17383 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 69 పాయింట్ల లాభం తో 5198 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.08 శాతం, స్మాల్ క్యాప్ రంగం 1.28 శాతం లాభపడటం తో మార్కెట్ల లో బుల్ల్స్ కి బలం చేకూరింది. సెక్టోరల్ ఇండెక్స్ ల లో నేడు చమురు మరియు గ్యాస్ సూచీ అత్యధికం గా 2.78 % l లాభపడింది. సెన్సెక్స్ పెద్దన్న రిలయన్స్ వాటాలు సుమారు 4 శాతం ఎగబాకటం తో ఈ సూచీ, తద్వారా సెన్సెస్ లాభాపడటానికి కారణమయ్యింది. నేటి ట్రేడింగ్ లో మెటల్స్ రంగం కూడా 1.73 % ఎగబాకింది. టాటా మెటల్స్ నేడు దాదాపు 3 % లాభపడింది. Q 4 తాలూకు ముందస్తు పన్ను చెల్లింపుల గణాంకాలు ఉత్తమంగా ఉండటం కూడా సెన్సెక్స్ వృద్ధికి తోడ్పడింది. నేటి ట్రేడింగ్ లో FMCG, PSU రంగాలు 0.4 % చొప్పున నష్టపోయాయి. NMDC కౌంటర్ నేడు కూడా పాతాలానికి పయనం కొనసాగించింది
నేడు స్టాకు ల వారిగా విశేషాలను గమనిస్తే , STRIDES ARCO ,ఆస్ట్రేలియా కి చెందిన ఎసేంట్ ఫార్మా లో వాటా ని కొనుగోలు చేయనునట్లు వార్త నేపధ్యం లో 4 % వృద్ధి పొందింది ఇండోనేషియా లో బొగ్గు గనుల వెలికితీత ప్రాజెక్ట్ కైవసం చేసుకోవటం తో మధుకాన్ ప్రాజెక్ట్ 3 % లాభపడింది. IVR WATER INFRA మరియు IVR STRATEGIC RESOURCES కంపనీలను విలీనం కొరకు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఆమోదం లభించటం తో నేడు IVR PRIME URBAN DEVELOPERS 4.5 % లాభపడటం విశేషం
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు భారతి అయిర్ టెల్ 1.6 % , ACC 1.26 % నష్టపోయాయి. కాగా ముందుగా చర్చించిన విధం గా రిలయన్స్ 3 .8 % , టాటా స్టీల్ 2 .82 % లాభపడ్డాయి .
- 16-3-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు మరొక సారి ఫ్లాట్ గా ముగిసాయి. బ్యాంకింగ్ రంగం లో సంస్కరణలు చేపట్టే దిశ లో అక్కడి సెనేట్ చర్యలు చేపట్టటం , గృహ నిర్మాణ దారుల విశ్వాసం సన్న గిల్లుతున్నట్లు వెలువడిన వివిధ గణాంకాల నేపధ్యం లో అక్కడి మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి.
నేటి ఆసియా మార్కెట్లు కూడా తీవ్ర ఆటు పొట్ల కు గురి అవుతున్నాయి. బ్యాంక్ అఫ్ జపాన్ ఆర్ధిక వ్యవస్థ పై తీసుకోబోయే నిర్ణయం స్టాక్ మార్కెట్లకు ప్రతికూలం గా వుండగలవన్న అంచనాల తో అక్కడి మార్కెట్లు ఆటు పొట్ల కు గురి అవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టు దిట్టం చేసే దిశ గా చైనా , వృద్ధి రేటుని తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు వార్త కూడా ఆసియా మార్కెట్ల ను మిశ్రమంగా కొనసాగింప చేస్తున్నాయి.
మన మార్కెట్ల పరంగా యోచిస్తే, నిన్న విడుదల ఐన టోకు ధర సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున అతి త్వరలో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటుని పెంచే అవకాశం ఉందన్న వాదన కి మరింత బలం చేకూరనున్నది. ఈ కారణం గ మన మార్కెట్లు కొంత ఆటు పొట్ల కి గురి అయ్యే అవకాశం ఉంది. అదే విధం గా అణు శక్తి పై కీలక నిర్ణయం పార్లమెంట్ లో స్తంభించటం కూడా మార్కెట్లను కలవరపెట్టే అవకాశం ఉంది . ఐతే విద్యా వ్యవస్థ లో విదేశీ పెట్టుబడులను అనుమతించాలన్న నిర్ణయం మార్కెట్లకు సానుకూలం
నేటి ఆసియా మార్కెట్లను అనుసరించి , మన మార్కెట్లు ఆటు పొట్ల కు గురయ్యే సూచనలు ఉన్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- · గత ముగింపు:: 17164
- · అవరోధాలు : 17180 -17246-17351
- · మద్దత్తు స్థాయిలు : 17060-16953- 16894
- 15-3-2010
- మార్కెట్ రిపోర్ట్
కనిష్ట స్థాయిల నుండి మార్కెట్లు కోలుకోవటం తో నష్టాల తో ప్రారంభమయిన మన మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా ముగిసాయి. దీనితో నిఫ్టీ 5129 పాయింట్ల వద్ద , 8 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ ముగియగా , సెన్సెక్స్ 2 పాయింట్ల స్వల్ప నష్టం తో 17165 పాయింట్ల వద్ద ముగిసింది. మా అంచనాలకి అనుగుణం గా నేడు మార్కెట్లు తీవ్ర ఆటు పొట్ల కి గురయ్యాయి . దీనితో ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 17061 పాయింట్ల వరకు క్షీణించింది. ఐతే మేము ఉదయం సూచించిన 17060 పాయింట్ల మద్దత్తు నిలవటం తో మార్కెట్లు నష్టాలను పూరించుకుని ఫ్లాట్ గా ముగిసాయి. కంపనీల సానుకూల Q 4 ముందస్తు పన్ను గణాంకాలు కూడా మార్కెట్లు కోలుకునేందుకు సహకరించాయి. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.74 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.83 శాతం చొప్పున నష్టపోయాయి.
సేక్టోరల్ సూచీ ల లో నేడు ఐ. టి ఇండెక్స్ అత్యధికం గా 1.37 % ఎగబాకగా , టెక్ రంగం 0.97 % వృద్ధి పొందింది. కాగా PSU ఇండెక్స్ నేడు 1.38 %, క్యాపిటల్ గూడ్స్ 1.09 % చొప్పున నష్టపోయాయి.
స్టాకు ల పరం గా నేడు రిలయన్స్ గా 0.64 % , టాటా స్టీల్ 0.42 % లాభపడ్డాయి. ముందస్తు పన్ను చెల్లింపులు ఈ కంపనీలవి ఉత్సాహపరిచే విధం గా ఉండటం తో ఈ కంపనీల వాటాలు లాభపడ్డాయి. ఫిబ్రవరి తాలూకు WPI 9.89 % పెరగటం తో , పెరుగుతున్న ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టుదిట్టం చేసే దిశ లో ప్రభుత్వం వడ్డీ రేటుని పెంచవచ్చన్న అంచనాల తో నేడు వడ్డీ రేటు పై ఆధారపడే ఆటో రంగం , క్యాపిటల్ గూడ్స్ రంగం, బ్యాంకింగ్ రంగాలు అతలాకుతలం అయ్యాయి.
మలేసియా అయిర్ లైన్స్ తో ఐదు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నందుకు గాను నేడు TCS 2.27 % లాభపడగా , విదేశాల లో $ 100 మిలియన్ల ను వెచ్చించినందుకు ZENSAR TECHNOLOGIES 2.44 % లాభపడింది. కంపనీ లాక్ అవుట్ ఎత్తివేయటం తో నేడు BOSCH 1 % లాభపడింది. తమ రియల్ ఎస్టేట్ , వేర్ హౌసింగ్ వ్యాపారాలను పునఃవ్యవస్థి కరణ చేపట్టనున్న నేపధ్యం లో TCI 19 % వృద్ధి ని నమోదు చేసింది. కాగా NMDC FPO కి గాను ధరను రూ. 300 గా ఖరారు చేయటం వలన NMDC 5 % నష్టపోయింది.
నిఫ్టీ స్టాకు ల లో నేడు HUL , WIPRO 3.1 %, 2.8 % చొప్పున లాభపడగా ABB, MNM 3.5 % , 3.2 % చొప్పున నష్టపోయాయి.