- 15-3-2010
- మార్కెట్ నాడి
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు దిశా హీనం గా పయనించి ఫ్లాట్ గా ముగిసాయి. అమెరికా మార్కెట్ల లో విడుదల అయిన కీలక రిటైల్ అమ్మకాల గణాంకాలు సానుకూలం గా వున్నా , పెరుగుతున్న వినియోగ దారుల నిర్లిప్తత మున్నగు అంశాలు అక్కడి మార్కెట్ల సెంటిమెంట్ ని దెబ్బ తీసింది. దీనితో అక్కడి మాకెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. ఐతే నేడు చోటు చేసుకోబోయే యూరో దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశం లో గ్రీస్ దేశానికి సహాయం చేయాలన్న తీర్మానం వెలవడే ఆస్కారం ఉన్నందున ప్రపంచ వ్యాప్తం గా మార్కెట్ల సెంటిమెంట్ కొంత మెరుగుపడింది. కాగా ఈ తీర్మానం పై యింకా జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు సందేహాలు వ్యక్తం చేయటం గమనార్హం.
ఐతే నేటి ఆసియా మార్కెట్లు లాభాల తో శుభారంభం చేసాయి. కాని ఈ లాభాలు ఎక్కువసేపు నిలబడ లేక పోయాయి. జపాన్ మార్కెట్లు శుభారంభం చేసినా , అక్కడి సెంట్రల్ బ్యాంకు ద్రవ్య పరపతి విధానం లో మార్పు చేసే అవకాశం ఉన్నదన్న అంచనాల తో మరల ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంటున్నది. నేడు సింగపూర్ లో రిటైల్ అమ్మకాల గణాంకాలు కూడా విడుదల కానున్నాయి. దీనితో సింగపూర్ మార్కెట్లు కూడా అప్రమత్తం గా ట్రేడ్ అవుతున్నాయి. . కాగా సింగపూర్ లో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ 5148 పాయింట్ల వద్ద లాభాల తో ప్రారంభం ఐనప్పటికీ మరల నష్టాల బాట పట్టటం వలన నేడు మన మార్కెట్లు కూడా ఆటుపోట్ల కి గురి అయ్యే అవకాశాలను సూచిస్తున్నది.
ఇక స్థానిక అంశాలు పరిశీలిస్తే, కేంద్ర గనుల శాఖ నాల్కో లో వాటా ని విక్రయించ దలచినట్లు ప్రకటించటం , వేదాంత గ్రూప్ తమ అల్యూమినియం యూనిట్లను విడదీసి, తదుపరి లిస్టింగ్ కావించనున్నట్లు ప్రకటించటం వలన మెటల్స్ రంగం నేడు వృద్ధి చెందే అవకాశం ఉంది. అదే విధం గా నేడు షిప్పింగ్ స్టాకు లు కూడా గణనీయం గా లాభపడే అవకాశం ఉంది. కాగా ఆటో , రియల్ ఎస్టేట్ రంగాలు కొంత మిశ్రమంగా ట్రేడ్ అయ్యే అవకాశాలు వున్నాయి.
మిశ్రమ ప్రపంచ మార్కెట్ల ధోరణి నేపధ్యం లో నేడు మన మార్కెట్లు కూడా ఆటు పాట్లకి గురి అయ్యే సూచనలు ఉన్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- · గత ముగింపు:: 17166
- · అవరోధాలు : 17180 -17246-17351
- · మద్దత్తు స్థాయిలు : 17060-16953- 16894