- మార్కెట్ ముంద చూపు
- (15-3-2010 నుండి 19-3-2010 వరకు )
వరుసగా గత ఐదు వారాలు లాభాల తో ముగిసిన మన మార్కులు ఈ వారం మరొక సారి సానుకూలం గా ప్రారంభం చేసే ప్రయత్నం చేయనున్నాయి. గడిచిన వారం , సెన్సెక్స్ 172 పాయింట్ల వృద్ధి ని నమోదు చేయగా, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ గత వారం గరిష్టం గా 17245 పాయింట్ల వరకు ఎగబాకింది. గత వారం, ఇదే శీర్షిక లో మా అంచనాలకి అత్యంత సమీపం గా ఇది ఉండటం గమనార్హం.
ఇక రాగల ఐదు రోజుల గురించి ప్రస్తావిస్తే, సనూకూల బడ్జెట్ మన మార్కెట్ల సెంటిమెంట్ ని బలపరచటం తో కొనుగోళ్ళ కి ఊతం అందించిన విషయం తెలిసినదే. ఈ వారం మార్కెట్లను బలహీన పరిచే అంశాలు లేకపోవటం, అమెరికా మార్కెట్ల లో విడుదల ఐన అత్యంత కీలక మైన చిల్లర వ్యాపార గణాంకాలు కూడా సానుకూలం గ విడుదల కావటం మన మార్కెట్ల కు ఆశాజనకం గా ఉందని చెప్పాలి. అదే విధం గా , దేశీయ సంస్థాగత మదుపర్లు IPO / FPO ల లొ భారి గా పెట్టుబడులు పెట్టటం, విదేశీ మదుపర్లు మన మార్కెట్ల పట్ల ఆసక్తి కనపరచటం మున్నగు అంశాలు కూడా మన మార్కెట్ల ని ప్రోత్సహించే విధం గా ఉంది. కాగా ఈ వారం నుండి Q4 ముందస్తు పన్ను చెల్లింపు వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఈ కారణం గా మన మార్కెట్లు స్టాకుల వారిగా ముందంజ వేసే అవకాశం ఉంది. ఈ వారం మార్కెట్ల లో కొన్ని కీలక IPO లు మదుపర్ల దృష్టి ని ఆకర్షించ నున్నాయి. PRADIP OVERSEAS రూ. 100 - 110 రూపాయల మధ్య ఇష్యూ ధర తో , ఈ సోమవారం ముగియనున్నది. ఈ IPO మా అంచనా ప్రకారం , ఆరు నెలల వ్యవధి లో రూ. 150 వరకు పెరిగే సూచనలు ఉన్నాయి . మీడియం టర్మ్ మదుపరులు , ఈ కౌంటర్ పట్ల ఆసక్తి కనపరిచే అవకాశం ఉంది. అదే విధం గా IL & FS IPO కూడా ఈ సోమవారం ముగియనున్నది. ఈ IPO ధర కొద్ది గా హెచ్చుగా నున్నా కాని, ప్రభుత్వం ప్రస్తుతం రోడ్లు, ఇన్ఫ్రా రంగానికి పెద్ద పీట వేయటం వంటి అంశాల వలన లిస్టింగ్ లాభకరం గా జరిగే సూచనలు ఉన్నాయి. IPO గరిష్ట ధర రూ. 258 గా ఉన్న ఈ IPO కొద్దిపాటి లాభాల తో లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది. దీర్ఘ కాలిక మదుపరులకు , అంటే కనీసం ఒక సంవత్సరం హోల్డింగ్ చేయగలిగే మదుపరులు ఈ IPO లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ IPO ల కారణం గా కొంత మేరకు సెకండరీ మార్కెట్ల లొ నుండి ప్రైమరీ మార్కెట్ల లొ కి దానం తరలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం ట్రేడింగ్ వోల్యుమ్స్ స్వల్పంగా తగ్గే సూచనలు ఉన్నాయి.
పై అంశాల సారాంశాన్ని మనం తీసుకుంటే, ఈ వారం మార్కెట్ల లొ పెద్దగా బుల్ రన్ కనిపించే అవకాశాలు లేవు, మార్కెట్లు సీమిత పరిధిలో పయనిస్తూ , స్థిరపడే ( CONSOLIDATE) అయ్యే సూచనలు ఉన్నాయి. టెక్నికల్ గా ఈ వారం సెన్సెక్స్ నకు 17250 , ఆ తరువాత 17460 సమీప అవరోధాలు. కాగా 17060 సెన్సెక్స్ పాయింట్లు సెన్సెక్స్ నకు సమీప మద్దత్తు ఈ మద్దత్తు కంటే తక్కు స్థాయి లొ ఎక్కువ మటుకు ట్రేడింగ్ జరిగితే , మార్కెట్ల లొ బలహీనత చోటుచేసుకునే అవకాశంఉంది. అప్పుడు 16800 వరకు క్షీణించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న స్థాయిల నుండి మార్కెట్లు ,ఈ వారం పెద్దగా ఎగబాకే అవకాశాలు లేవు . కాబట్టి ట్రేడెర్ లు స్టాకు ల వారిగా ట్రేడ్ చేయటం పై దృష్టి సారించటం మంచిది. నిఫ్టీ పరం గా 5170 -5187 మధ్య గట్టి అవరోధం ఉంది. కాగా ఈ అవరోధం చేదిస్తే 5250 తదుపరి అవరోధం కానున్నది. కాగా 5095 -5080 నిఫ్టీ కి సమీప మద్దత్తు .ఇది వీగిపోతే 5000 పాయింట్లు తదుపరి కీలక మద్దత్తు. మార్కెట్లు సానుకూలం గా ఉంటే గరిష్టం గా 5325 వరకు ఎగబాకే అవకాశం ఉంది.