- 12-3-2010
- మార్కెట్ రిపోర్ట్
నేడు మన మార్కెట్లు, మేము ఉదయమే సూచించిన విధం గా , అప్రమతంగా ట్రేడ్ అయ్యాయి. దీనితో మన మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యి చివరికి ఫ్లాట్ గా ముగిసాయి. దీనితో సెన్సెక్స్ కేవలం ఒక పాయింట్ స్వల్ప నష్టం తో 17166పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 3.6 పాయింట్ల నామ మాత్రపు లాభం తో 5137 యింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.23 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.45 శాతం చొప్పున నష్టపోయాయి
నేడు విడుదల ఐన IIP గణాంకాలు స్వల్పంగా తగ్గుదల సూచించటం వలన మన మార్కెట్లు కొద్ది పాటి ఆటుపోట్లకి గురియ్యింది. ఐతే అమెరికా లో విడుదల కానున్న కీలక చిల్లర వ్యాపార గణాంకాల నేపధ్యం లో మన మార్కెట్లు , అప్రమత్త ధోరణిని ప్రదర్శిస్తూ ఫ్లాట్ గా ముగిసాయి. మన మార్కెట్ల ముగింపు సమయానికి అమెరికా డౌ ఫ్యుచేర్స్ కూడా స్వల్ప లాభాల తో ట్రేడ్ అవుతున్నాయి
నేడు సెక్టరల్ సూచీ ల లో క్యాపిటల్ గూడ్స్ సూచీ 0.63 % , రియాలిటీ సూచీ 0.83 % నష్టపోయాయి . కాగా నేడు మెటల్స్ 0.63 % , ఆయిల్ మరియు చమురు సూచీ 0.41 % లాభపడ్డాయి.
నిఫ్టీ స్టాకుల పరం గా నేడు కై ర్న్ ఇండియా 4.3 %, హిందాల్కో 3.3% వృద్ధిని ని నమోదు చేసాయి. కాగా HUL 3.8% , సన్ ఫార్మ 2.4 % నష్టాలను నమోదు చేసాయి.