• 12-3-2010
  • మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా మార్కెట్లు దిశాహీనం గా పయనించి చివరికి స్వల్ప లాభాల తో ముగిసాయి. నిరుద్యోగ భత్యం లబ్దిదారుల గణాంకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టటం తో అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిసాయి.

నేడు ఇతర ఆసియా మార్కెట్లు ఆటు పోట్లని ఎదురుకుంటున్నాయి .జాపాన్ సెంట్రల్ బ్యాంక్ అక్కడి ఆర్ధిక వ్యవస్థ లో మరింత ధనాన్ని విడుదల చేయనున్న నేపధ్యం లో అక్కడి మార్కెట్లు లాభాల తో ప్రారంభమయ్యాయి. ఇతర ఆసియా మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమవ్వటం వలన నేడు మన మార్కెట్లు కూడా ఇదే రీతిన స్వల్ప లాభాల తో ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి.

మన మార్కెట్ల పరంగా యోచిస్తే, మన దేశం లో పర్యటిస్తున్న రష్యా అధినేత , మన దేశం తో యుద్ధ సామగ్రి మరియు చమురు రంగాల పై కీలక ఒప్పందం చేసే అవకాశం ఉంది. అదే విధం గా మన దేశం లో రత్నాల దిగుమతి పై కూడా కొన్ని అంశాలు ప్రస్తావించనున్నారు. ఇప్పటికే ONGC కి సైబేరియా ప్రాంతం లో చమురు నిక్షేపాల పై కొంత వాటా కలిగి ఉంది. ఒప్పందాలు ఫలిస్తే, మును ముందు ఈ కౌంటర్ లో కొంత చలనం కలిగే అవకాశం ఉంది. కాగా మన దేశం లో ఫ్యాక్టరీ ఉత్పత్తుల గణాంకాలు కూడా 16 నెలల గరిష్ట స్థాయి లో వెల వడ్డాయి . ఈ కారణం గా మన మార్కెట్ సెంటిమెంట్ నేడు స్థిరం గా ఉండే అవకాశం ఉంది.

నేడు వారాంతం కనుక , నేడు మన మార్కెట్ల లో భారి కొనుగోళ్ళు చోటు చేసుకునే అవకాశం లేదు. పైగా అమెరికా లో నేడు సాయంత్రం విడుదల కానున్న రిటైల్ అమ్మకాల గణాంకాలు అత్యంత కీలక మైనవి. ఈ కారణం గా మన మార్కెట్లు నేడు అప్రమత్త ధోరణి తో ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మదుపరులు స్టాకులు వారిగా ట్రేడ్ చేయటం ఉత్తమం. షాంగై మార్కెట్ల లో రాగి ధర బలపడే అవకాశం ఉంది కనుక నేడు మన కామోడిటి మార్కెట్ల లో కూడా రాగి పెరిగే అవకాశం ఉంది. చమురు కూడా స్థిరంగా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి .

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • · గత ముగింపు:: 17168
  • · అవరోధాలు : 17180 -17226-17351
  • · మద్దత్తు స్థాయిలు : 16963-16894- ౧౬౬౬౬