- 9-3-2010
- మార్కెట్ రిపోర్ట్
ఆసియా మార్కెట్లను అనుసరించి నేడు మన మార్కెట్లు కూడా లాభాల స్వీకరణ కి గురయ్యాయి . మధ్యాన్నం ట్రేడింగ్ లో కూడా , అమెరికా - గ్రీస్ దేశాల మధ్య ,నేటి రాత్రి ,చోటుచేసుకోబోయే చర్చల నేపధ్యం లో ఐరోపా మార్కెట్లు అప్రమత్త ధోరణి తో ప్రారంభమవ్వటం, మన మార్కేట్లని మరింత బలహీన పరిచాయి. మన మార్కెట్లు పెక్కు మార్లు ఎగబాకేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవటం తో నేడు సెన్సెక్స్ ప్రధానం గా 17131 - 17031 పాయింట్ల మధ్య ఉగిసలాడి చివరికి నష్టాల తో ముగిసింది. సెన్సెక్స్ నేడు 50 పాయింట్లు కోల్పోయి 17053 పాయింట్ల వద్ద నిలిచింది, కాగా నిఫ్టీ 22.5 పాయింట్ల నష్టం తో 5101.5 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.72 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.71 శాతం చొప్పున నష్టపోయాయి.
సేక్తోరాల్ సూచీ ల లో నేడు కేవలం ఐ. టి ఇండెక్స్ 0.85 % , టెక్ ఇండెక్స్ శాతం లాభపడ్డాయి ,కాగా మిగిలిన సూచీలు భాల్లుకాల దెబ్బకి కుదేలుమన్నాయి. మెటల్స్ రంగం నేడు అత్యధికం గా 1.56 % క్షీణించింది. కాగా psu రంగం 1.43% మేరకు నష్టపోయింది.
క్రూడ్ ఆయిల్ ఫ్యుచేర్స్ నష్టపోవటం తో నేడు ఎస్సార్ ఆయిల్ , కేర్న్ ఇండియా 1.5 ~ 2.8 % మేరకు నష్టపోయాయి. ల్యోన్దేల్ బాసెల్ , రిలయన్స్ బిడ్ ని తిరస్కరించటం తో ఈ కౌంటర్ కూడా నేడు నష్టాలను చవిచూసింది. సంస్థాగత మదుపరులకు 5 కోట్ల షేర్లను విక్రయించ దలచనున్నట్లు ప్రకటించటం తో exide 4 % లాభపడింది . జర్మన్ ఆటో తయారి కంపనీ తమకు టాటా మోటర్స్ లో గల భాగస్వామ్యం నుండి పూర్తిగా వైదొలగనున్నట్లు చేసిన ప్రకటన వలన టాటా మోటర్స్ నేడు భారిగా 6 % క్షీణించింది. ఫేం ఇండియా కొనుగోలు కై ADA గ్రూప తమ కొనుగోలు బేరాన్ని పెంచటం తో ఫేం ఇండియా నేడు 1.86 % లాభపడింది. ముంబై లో ప్రభాదేవి స్థలాన్ని అమ్మివేయటం వలన ICICI బ్యాంకు లాభపడగా, బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ ప్రోమోటర్ ఐన తాయాల్ కుటుంబాన్ని SEBI ట్రేడింగ్ నుండి బహిష్కరించటం తో ఈ కౌంటర్ 7 % నష్టపోయింది.
నిఫ్టీ స్టాకు ల లో నేడు JP ASSOCIATES 3.6 % , SUZLON 3.3 % చొప్పున నష్టపోగా HDFC , HDFC BANK 1.8%, 1.4 % చొప్పున లాభపడ్డాయి.