- 19-2-2010
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల తో ముగిసిన అనంతరం , అక్కడి ఫెడ్రల్ రిజర్వు ,, అక్కడి బ్యాంకు లకు ఇచ్చే అత్యవసర రుణాల పై 25 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటు ను పెంచనున్నట్లు ప్రకటించటం తో ఆసియా మార్కెట్ల పై ఇది పిడుగుపాటు గా మారింది. దీనితో నేడు జపాన్, సింగపూర్ కొరియా మార్కెట్లన్నీ కూడా నష్టపోతున్నాయి. అమెరికా ఫేడ్ నిర్ణయం మెరుపు వేగం తో వెలువడటం మార్కెట్లు జీర్ణించుకోలేక పోతున్నాయి. అప్పటికీ అమెరికా ఫేడ్ , ఈ వడ్డీ రేటుని పెంచినా ఉద్దేపణలు కొనసాగుతాయని భరోసా ఇచ్చినప్పటికీ , మార్కెట్ వర్గాలు విశ్వసించలేక పోతున్నాయి. ఫేడ్ చర్య , మును ముందు ఉద్దేపనలను వేనుతీసుకునే దిశ లో చేపట్టిన చర్య గా భావిస్తున్నాయి. ఈ కారణం గా అమెరికా డాలర్ మరింత గా బలపడటం, బంగారం ధర సుమారు 1 % క్షీనించేందుకు కారణమయ్యింది. ఇది ఇలా ఉండగా , సింగపూర్ వృద్ధి రేటు సుమారు 6.5 % వరకు ఉండగలదని నేడు వెలువడిన సానుకూల అంశం కూడా నేడు అక్కడి మార్కేట్లని లాభాల లో నడిపించ లేక పోతున్నాయి. నేడు ఆసియా మార్కెట్లు అత్యంత బలహీనం గా ట్రేడ్ అవుతున్నాయి. స్థానిక అంశాలను పరిశీలిస్తే, గత రాత్రి కేంద్ర క్యాబినెట్ ఫెర్టి లై జేర్స్ పై కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందులో భాగం గా యూరియా ధరలను 10 % పెంచనున్నట్లు, తద్వారా 13000 కోట్ల బడ్జెట్ లోటు ని తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. ఐతే కంపనీలు యదేచ్చగా యూరియా ధరలను పెంచితే సహించేది లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వలన యూరియ వినియోగం, అతి గా కాక , సరి అయిన మోతాదులో జరగనున్నదని, తద్వారా భూసారం కాపాడవచ్చని విశ్వాసం వెలబుచ్చింది . ఈ కీలక నిర్ణయం నేపధ్యం లో అతి త్వరలో పరిక్ నివేదిక అనుగుణం గా పెట్రో , గ్యాస్ ధరలను కూడా ప్రభుత్వం పెంచే అవకాశం మెరుగైనట్లు మనం భావించవచ్చు. ఈ అంశం , సామాన్యుడి పరిస్థితి ని పక్కన పెడితే, మార్కెట్లకు మాత్రం సానుకూలం. ఇది ఇలా ఉండగా రిజర్వు బ్యాంక్ గవర్నోర్ , మార్చ్ నాటికి ద్రవ్యోల్బణం గతం లో ప్రకటించిన విధం గా 8.5 % గా ఉండగలదని పునరుద్ఘటించారు .
బలహీన మైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో మన మార్కెట్లు కూడా కొంత క్షీణించే అవకాశం ఉన్నపటికీ , స్టాకుల పరంగా , ముఖ్యం గా ప్రవేటు ఫర్టి లైజేర్ కంపనీలకు, ముఖ్యం గా TATA CHEMICALS, COROMONDAL INTERNATIONAL, ZUARI INDUSTRIES, RCF , CHAMBAL కంపనీలకు లాభదాయకం
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16328
- అవరోధాలు: 16340-16486-16527 -16606
- మద్దత్తులు:16252-16124-16064
- PLEASE NOTE:
To get free STOCK tips on your mobile, please type ON , give space, then again type TELUGUSTOCKMARKET and sms to 9870807070. This service* is free of cost and is available through out INDIA ..
- గమనిక