- 19-2-2010
- మార్కెట్ రిపోర్ట్
ఉదయం మా అంచనాలకి అనుగుణం గా నేడు మన మార్కెట్లు నష్టపోయాయి. మేము చర్చించిన విధం గా అమెరికా ఫెడ్ బ్యాంకు ల పై వడ్డీ రేటు ని పెంచటం తో ప్రతికూల ప్రభావం మన మార్కెట్ల పై పడింది .దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 136పాయింట్లు కోల్పోయి 16191పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 43 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుని 4845 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.41 % , స్మాల్ క్యాప్ రంగం 1.57% మేరకు నష్టపోయాయి.
సేక్టోరల్ సూచీ ల లో నేడు రియాలిటీ రంగం అత్యధికం గా నష్టపోయింది. ఈ సూచీ 3.37 % నష్టపోగా మెటల్స్ రంగం కూడా 2.49 % నష్టపోయి సెన్సెక్స్ పతనానికి కారణమయ్యింది. సెన్సెక్స్ నష్టపోవటం తో మదుపరులు defensive స్టాకు ల పట్ల మోజు చూపటం తో నేడు హెల్త్ కేర్ సూచీ మాత్రం స్వల్ప లాభాలను నమోదు చేయగలిగింది. ఈ సూచీ ౦.07 % లాభపడి బుల్ల్స్ కి కొంత ఊరట కలిగించింది.
స్టాకుల పరం గా నేడు లిస్టింగ్ జరిగిన తంగ మాయిల్ జ్వేలేరి IPO ధర రూ. 75 కంటే తక్కువగా రూ 71 వద్ద ముగిసింది. రెండు రోజులు గా భారి గా నష్టపోయిన హిందూస్తాన్ కాపర్ లో నేడు షార్ట్ కావేరింగ్ చోటు చేసుకోవటం తో ఈ కౌంటర్ కొంత లాభపడింది.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు HDFC 0.94 % , MARUTI 0.63 % లాభపడగా JAIPRAKASH 4.35 %, DLF 4.10 % క్షీణించాయి.