• 18-2-2010
  • మార్కెట్ రిపోర్ట్

ఉదయం మా అంచనాలకి అనుగుణం గా నేడు మన మార్కెట్ల లో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 101 పాయింట్లు కోల్పోయి 16328 పాయింట్ల వద్ద నిలిచింది. కాగా నిఫ్టీ 26 పాయింట్ల నష్టం 4888పాయింట్ల వద్ద ముగిసింది.

బలహీనమైన ఆసియా మార్కెట్లు , తదుపరి నష్టాల తో ప్రారంభమైన ఐరోపా మార్కెట్లు మన మార్కెట్లను ఆద్యంతం నష్టాల లో పయనింప చేసాయి. IMF బంగారాన్ని విక్రయించ దలచినందున నేటి కరెన్సీ మార్కెట్ల లో అమెరికా డాలర్ బలపడింది.

నేడు విడుదల ఐన ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా నేటి మార్కెట్లను బలహీనపరిచాయి. వరుసగా నాలుగవ వారం ద్రవ్యోల్బణం పెరిగి రిజర్వు బ్యాంక్ పై కీలక వడ్డీ రేటు ని పెంచే దిశా గా మరింత వత్తిడి ని పెంచింది. ఫెబ్రవరి 6 నకు చెందిన ఆహార పదార్థాల తాలూకు ద్రవ్యోల్బనం 17.97 % గా నమోదు అయ్యింది. అంతకు ముందు ఇది 17.94 % గా ఉండింది .

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.62 % , స్మాల్ క్యాప్ రంగం 0.40 % కోల్పోయి మార్కెట్లను మరింతగా నష్టపరిచాయి. సేక్టోరల్ సూచీ ల లో రియాలిటి రంగం అత్యధికం గా 2.12 %, చమురు మరియు గ్యాస్ సూచీ 2.01 % క్షీణించింది . కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ ౦.52 % , బ్యాంకింగ్ రంగం ౦.32 % లాభ పడ్డాయి. స్టాకుల వారిగా పరిశీలిస్తే నేడు BPCL 4.69 % లాభపడింది . మొజాంబిక్ దేశం లో గ్యాస్ నిక్షేపం కనుగొనటం దీనికి కారణం అయ్యింది. కాగా చెన్నై పెట్రో కూడా తమ మనాలి రిఫైనేరి లో HYDRO TREATING REACTOR నెలకొల్పటం వలన పరిశుద్దమైన డిజిల్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం పెంచుకోవటం వలన 0.93 % పెరిగింది .కాగా రిలయన్స్ , ల్యోన్దేల్ బాసెల్ కొనుగోలుకై ఇచ్చిన ఆఫర్ ని మరింత గా పెంచే పరిస్థితి నెల కొనటం తో ఈ కౌంటర్ 3.35 % నష్టపోయింది . యాక్సిస్ బ్యాంక్ నకు UK లో బ్రాంచ్ నెలకొల్పేందుకు ఆమోదం లభించటం తో ఈ కౌంటర్ లాభాల పంట పండించింది. ప్రపంచ విపణుల లో చెక్కర ఫ్యుచేర్స్ నష్టపోవటం తో నేడు షుగర్ స్టాకులు కుదేలు మన్నాయి. కీలక క్యాబినెట్ సమావేశం నేపధ్యం లో ఫెర్టి లై జేర్స్ స్టాకులు లాభాపడాయి. క్యాబినెట్ సమావేశం లో ఫెర్టి లై జేర్స్ సబ్సిడీ పై కీలక నిర్ణయం తీసుకోనున్నది. సెన్సెక్స్ స్టాకు ల లో నేడు రిలయన్స్ 3.35 % , స్టర్ లైట్ 2.56 % నష్టపోయాయి. కాగా HDFC 1.79 % NTPC 1.54 % లాభపడాయి.