• 9-2-2010
  • మార్కెట్ నాడి

గ్రీస్ దేశం లో నెలకొని ఉన్న సంక్షోభం నేపధ్యం లో నిన్న అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. డౌ జోన్స్ 10,000 పాయింట్ల కంటే దిగువగా ముగిసి మదుపర్ల సెంటిమెంట్ ని దెబ్బ తీసింది. నవంబర్ తరువాత ఇంత కనిష్ట స్థాయిలో అమెరికా మార్కెట్లు ముగియటం ఇదే ప్రథమం . నేడు ఆసియా మార్కెట్లు కూడా ఇదే పంధాలో నష్టాలకు గురి అవుతున్నాయి. జపాన్ మార్కెట్ల లో ప్రారంభం లోని కనిష్ట స్థాయి ల నుండి కొంత పెరుగుదల కనిపించినా ,మరల నష్టాల లో కూరుకుపోతున్నది. ఇతర ఆసియా మార్కెట్లు కూడా వాల్ స్ట్రీట్ ని అనుసరించి నష్టాల లో ట్రేడ్ అవుతున్నాయి. నేడు మన మార్కెట్లు కూడా ఇదే తరహా లో నష్ట పోయేందుకు గాను కావలసినన్ని కారణాలు ప్రభుత్వం మదుపర్ల ముందు పెట్టింది. ముఖ్యం గా , దేశాభివృద్ధి 7.2 % మేరకు వుండగలదని , కాబట్టి ఉద్దిపనలను ఇక ఉపసంహరించావలసిందే అని మోంటెక్ సింగ్ ఆహువాలియా పదే పదే నొక్కిచేప్పటం మార్కెట్ల సెంటిమెంట్ కొంత దెబ్బ తీసే అంశం .ఉద్దిపనలు వుపసంహరిస్తే గడ్డు కాలమని హీరో హోండా మరియు ఇతర వాహన తయారి కంపనీలు వాపోయాయి. ఇది ఇలా వుండగా, బ్యాంకు లు తమ ఆస్తులను సేక్యురిటి ల విధం గా మార్చే విధానం ( securitization of assets ) , ఆ సెక్యురిటి ల ట్రేడింగ్ లో ఆయా బ్యాంకుల పాత్ర గురించి పూర్తి పార్వదర్శకత్వం తెలిపే విధం గా రిజర్వు బ్యాంక్ కొన్ని నిబంధలను ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం బ్యాంకులు మరికొంత నిలువలను పక్కన పెట్టవలసి వస్తుంది.

ఈ అంశాల వలన మన మార్కెట్ల లో సంబరాలు చోటు చేసుకునే అవకాశం లేదు కనక నేడు మన మార్కెట్లు , బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో, మరికొంత క్షీణించే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15935
  • అవరోధాలు: 15957-16064-16124-16252
  • మద్దత్తులు:15831-15660-15554