- 8-2-2010
- మార్కెట్ రిపోర్ట్
ఒడి దుడుకుల మధ్య నేడు మన మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప లాభం తో 15936పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 4760పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 3 పాయింట్లు లాభపడింది.
నేటి ట్రేడింగ్ లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురి అయ్యి ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 15651 పాయింట్ల వరకు పడిపోయింది .ఐతే కీలక మద్దతు స్థాయి అయిన 15660 పాయింట్ల వద్ద మద్దత్తు మూటగట్టు కొని, షార్ట్ కవెరింగ్ సహాయం తో మార్కెట్లు మరల లాభాలను ఆర్జించాయి. పైగా ఐరోపా మార్కెట్లు లాభాల తో ప్రారంభం కావటం కూడా మన మార్కెట్ల లో షార్ట్ కవరింగ్ చోటు చేసుకునేందుకు ఉపకరించింది. ఐతే తాజా ట్రేడ్ లో ఐరోపా మార్కెట్లు తిరిగి నష్టపోవటం తో మన మార్కెట్లు కూడా లాభాలను విసర్జించి ఫ్లాట్ గా ముగిసాయి.
నేటి ట్రేడింగ్ లో జుబిలంట్ ఫుడ్ వర్క్స్ లిస్టింగ్ జరిగింది. ఈ స్టాకు ని IPO లో కొనమని మేము సూచించిన విషయం మీకు తెలుసు. మా అంచనాల ని నిజం చేస్తూ ఈ కౌంటర్ 58 % లాభాలను నమోదు చేస్తూ రూ. 229 వద్ద ముగిసింది. IPO ధర రూ 145 గా ఉండింది.
పోలి మేడి క్యూర్ వాటా దారులకు బోనస్ ప్రకటించటం తో 20 % గరిష్ట సీలింగ్ వద్ద నిలిచింది. కాగా మార్చ్ నాటికి సంవరియా ఆగ్రో 100 కోట్లు సమీకరించ నున్నట్లు ప్రకటించటం తో ఈ కౌంటర్ కూడా 5 % గరిష్ట సీలింగ్ వద్ద నిలిచింది.
నేడు CSO భారత దేశపు GDP FY 10 నకు 7.2 % ఉండగలదని అంచనాలను వెలబుచ్చింది. ఐతే ఈ అంశం పై నేటి ట్రేడింగ్ లో మార్కెట్లు ఎటువంటి ప్రతిక్రియా చూపలేదు
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.09 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.08 శాతం మేరకు కోల్పోయాయి. నేటి ట్రేడింగ్ లో సేక్టరాల్ సూచీల తీరుని గమనిస్తే, మెటల్స్ సూచీ 1. 38 % అత్యధికం గా నష్టపోయింది. కాగా ఆటో ఇండెక్స్ 0.21 % కోల్పోయింది.నేటి ట్రేడింగ్ లో క్యాపిటల్ గూడ్స్, టెక్ రంగాలు 0.56 % చొప్పున అత్యధిక లాభాలను ఆర్జించాయి
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు టాటా స్టీల్ అత్యధికం గా 4.46 % , హిందాల్కో 3.75 % నష్టపోయింది. భారతి అయిర్ టెల్ 2.70 % , RCOM 2.21 % చొప్పున లాభపడ్డాయి.