• 9-2-2010
  • మార్కెట్ రిపోర్ట్

బలహీనం గా ప్రారంభమైన మన మార్కెట్లు US ఫ్యుచేర్స్ ఇండెక్స్ లాభపడటం తో పుంజుకుని మరల లాభాల బాట లో నడిచింది. దీనితో సెన్సెక్స్ పాయింట్లు 106 లాభపడి 16042 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 32 పాయింట్ల లాభం తో 4792 పాయింట్ల వద్ద ముగిసింది .

నేటి ట్రేడింగ్ సమయం లో , గ్రీస్ దేశానికి యురోపియన్ యూనియన్ సహాయం అందజేయవచ్చన్న అంచనాల తో ఇతర ఆసియా మార్కెట్లు చివర లో లాభపడటం కూడా మన మార్కెట్లకి కలిసొచ్చింది. దీనితో సెన్సెక్స్ గరిష్టం గా 16062 పాయింట్ల వరకు ఎగబాకింది . ఇది మేము ఉదయమే సూచించిన కీలక మజిలి ఐన 16064 పాయింట్లకు అత్యంత సమీపం గా ఉండటం గమనార్హం చివరికి సెన్సెక్స్ 16042 పాయింట్ల వద్ద , నేటి ట్రేడింగ్ ముగిసింది.

. టి స్టాకు ల పట్ల మదుపరులు ఆసక్తి చూపటం తో నేడు ఐ. టి స్టాకులు లాభాలను ఆర్జించాయి. కాగా SBI చైర్మన్ OP భట్ త్వరలో బ్యాంకు వడ్డీ రేటుని పెంచగలదని సూచించటం తో అప్పటివరకు నష్టపోతున్న బ్యాంకింగ్ రంగం కోలుకుని లాభాలను ఆర్జించింది .

హై కోర్ట్ , స్పైస్ కమ్యూనికేషన్ విలీనానికి అంగీకరించటం తో ఐడియా సేల్ల్యులర్ నేడు 1 .7 % మేరకు ఎగబాకింది .కాగా సిమెంట్ ధరలు బ్యాగ్ కి సుమారు 3 నుండి 5 రూపాయల వరకు ఈ మాసం 1 వ తేది నుండి పెంచటం తో నేడు సిమెంట్ స్టాకు లు కూడా చక్కటి లాభాలను గడించాయి.

రిజర్వుబ్యాంక్ , బకాయిల పునవ్యవస్తికరణ కు ససేమిరా అనటం తో రియల్ ఎస్టేట్ స్టాకులు కుదేలుమన్నాయి .హైపెర్ టెన్షన్ నకు మందుల తయారికి USFDA నుండి ఆమోదం దొరకటం తో నేడు STRIDES ARCO 13.2% ఎగబాకింది. కాగా SAIL , బోనస్ ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాల తో ఈ కౌంటర్ కూడా మదుపరులకు లాభాల పంట పండించిది, నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం , స్మాల్ క్యాప్ రంగం 4 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా సెక్టోరల్ సూచీ ల లో ఐ. టి 2 .5 % టెక్ 2. 1 % చొప్పున లాభాలను గడించాయి. కాగా రియాలిటీ 1.2 % , చమురు మరియు గ్యాస్ 0.2 % నష్టాలను నమోదు చేసాయి సెన్సెక్స్ స్టాకు ల లో గ్రాసిం 4.8 % , ACC3.2 % లాభపడగా , DLF 1.5 % , హిండాల్కో 1.4 % మేరకు నష్టాలను చవిచూశాయి.