• రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే శాఖమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే "వే లాదిగా ప్రజా ప్రతినిధులనుంచి ఇది చెయ్యాలని, అది చెయ్యాలనీ అభ్యర్ధిస్తూ లేఖలు వచ్చాయ''ని, అయితే ఉన్న పరిమితి వనరులతో చేయగలిగినంతా చేశానని ప్రకటించారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన రైల్వేలైనులే ఇప్పటికీ దిక్కుగా ఉన్నాయని, ఇక నుంచి కొత్త రైలు మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నానని ఆమె చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాలూ రైలు మార్గాలపై వేల వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, మనం కూడా ఆ దిశగా పయనించాలని ఆమె ఉద్ఘాటించారు. ఈ బడ్జెట్ నేంచే మనం ఆ పయనం ప్రారంభించదలచినట్టు ఆమె పునరుద్ఘాటించారు.

మమతా బెనర్జీ పార్లమెంటులో రెండో సారి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి రైలు ఛార్జీలు పెంచే యోచన లేదని ఆమె తెలిపారు. రైల్వే బడ్జెట్‌ వివరాలు...

  • * ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూతో పాటు స్థానిక భాషల్లోనే రైల్వే పరీక్షలు.
  • ప్రైవేటీకరణ వాటాల విక్రయం ఉండదు. *
  • వ్యవసాయ ఉత్పత్తుల రవాణకు ప్రత్యేక రైళ్లు.
  • * రైల్వే విచారణకు 138 కొత్త నెంబర్‌ *
  • ఢిల్లీ, సికింద్రాబాద్‌, చెన్నై, కోల్‌కతా ముంబయిల్లో క్రీడా అకాడమీలు.
  • * కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ కొత్తగా శాంతి ఎక్స్‌ప్రెస్‌.
  • * రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లను విస్తరణ.
  • * రైల్వేస్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం. *
  • ప్రైవేటు భాగస్వామ్యంతో ఆదాయం పంచుకునే పద్ధతిలో కొత్త రైలు మార్గాల రూపకల్పన.
  • * రైలు ప్రమాదాల నివారణకు నిధుల పెంపు.
  • * పర్యాటక కేంద్రాలను కలుపుతూ కొత్తగా సంస్కృతి ఎక్స్‌ప్రెస్‌ ఏర్పాటు.
  • * పెట్టుబడులను ఆకర్షించేలా నిబంధనల సరళీకరణ.
  • * గత బడ్జెట్‌లో చెప్పినట్లు 120 రైళ్లలో 117 వచ్చే నెలలోనే ప్రారంభం.
  • * ఏడాదికి సుమారు వెయ్యి కిలోమీటర్ల కొత్తరైళ్ల మార్గాలు.
  • * ప్రయాణీకులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఆరు ప్రాంతాల్లో రక్షిత నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటు.
  • రైల్వే అభివృద్ధి మిషన్‌-2020 కార్యక్రమం.
  • * ఈఏడాది ప్రయాణికుల సౌకర్యాలకు అదనంగా రూ.400కోట్లు.
  • * ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, కోర్టులు, పంచాయితీలు, ఐఐటీల్లోనూ ఈటికెట్‌ రిజర్వేషన్ల ఏర్పాటు.
  • పోస్టాఫీసుల్లో రిజర్వేషన్లు కేంద్రాలు ఏర్పాటుకు నిధుల సమస్య.
  • * మరో మూడు డివిజన్లలో రైళ్లు ఢీకొనకుండా ప్రత్యేక వ్యవస్థ.
  • * మౌలిక సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి.
  • * దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారానికి కొత్త ప్రణాళిక.
  • * రైల్వే ఉద్యోగులకు పదేళ్లలో కొత్త ఇళ్ల నిర్మాణం.
  • * రైల్వే ఉద్యోగులకు వైద్య సౌకర్యాల పెంపు.
  • * 93 ప్రధాన స్టేషన్లలో మల్లీలెవల్‌ పార్కింగ్‌ కేంద్రాలు.
  • * తమిళనాడులో పెరంబూరు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఆధునికీకరణ. * ప్రమాదాల నివారణకు క్రాసింగ్‌ల వద్ద 17వేల కొత్త సిబ్బంది.
  • * రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సులో మాజీ సైనికుల నియామకం.
  • * ఖరగ్‌పూర్‌లో లోకో పైలట్‌ శిక్షణా కేంద్రం.
  • భూమి లభిస్తే సింగూర్‌లో రైల్వే ఫ్యాక్టరీ.
  • * డబుల్‌ డెక్కర్‌ రైలు ప్రయోగాత్మకంగా అమలు.
  • * కామెన్‌వెల్త్‌ క్రీడలకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.
  • * సరకు రవాణా ఛార్జీల పెంపులేదు.
  • * ఏడాదిలోగా రాయబరేలి ఫ్యాక్టరీ పనులు. *
  • సికింద్రాబాద్‌లో వేగన్స్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు.
  • * స్లీపర్‌ క్లాస్‌లో సర్వీస్‌ ఛార్జి రూ. 10 తగ్గింపు.
  • * హై స్పీడ్‌ రైల్వే వ్యవస్థ ఏర్పాటు.
  • వ్యాన్ల ద్వారా రైల్వే టికెట్ల అమ్మకం.
  • * 2020 నాటికి 25 వేల కొత్త రైళ్ల మార్గాల ఏర్పాటు.
  • * ప్రైవేటు భాగస్వామ్యంతో వాటర్‌ బాటిల్‌ కేంద్రాలు.