• 24-2-2010
  • మార్కెట్ నాడి

అమెరికా లో గత రాత్రి విడుదల అయిన కన్సుమెర్ కాన్ఫిడెన్స్ గణాంకాలు అతి దారుణం గా పడిపోవటం తో అక్కడి మార్కెట్లు తీవ్రం గా నష్టపోయాయి. నేటి ఆసియా మార్కెట్లు కూడా అమెరికా మార్కెట్ల నుండి అందిన సంకేతాల నేపధ్యం లో తీవ్రం గా నష్టపోతున్నాయి. జర్మనీ దేశం లో కూడా కన్సుమెర్ కాన్ఫిడెన్స్ గణాంకాల లో క్షీణత నమోదు కావటం వలన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కోలుకునేదుకు మరింత సమయం పట్టనున్నదన్న అంచనాల్ల తో ప్రపంచ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి.

మన దేశం లో ని కీలక అంశాలను చర్చిస్తే, నేడు పార్లమెంట్ లో రైల్వే మంత్రి రైల్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ లోమరిన్ని దురంట్ రైళ్ళను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే విధం గా రైల్వే లో వాగన్ కొరత నానాటికీ తీవ్రతరం అవుతున్నందున ఈ సారి వాగన్ కొనుగోళ్ళు, ప్రైవేటు రంగం పెట్టుబడులను ఆహ్వానించే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక 26 న వెలువడే కేంద్ర బడ్జెట్ లో సర్విస్ , ఎక్సైజ్ పన్నులు సుమారు 2 % పెంచవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. కాగా సహాయ మంత్రి మీనా ఉద్దేపనలను కేవలం మధ్యంతర కవచం లా ఉపయోగించారని సూచించటం వలన ఈ సారి బడ్జెట్ లో ఉద్దేపణలు ప్రభుత్వం వెను తీసుకునే అవకాశాలు పెరిగాయి . ద్రవ్య లోటు తగ్గించే దిశగా ప్రభుత్వ సంస్థలను ఎట్టి పరిస్థితి లో నైనా లిస్టింగ్ చేసి తీరుతామని ఆర్ధిక మంత్రి ప్రకటించటం కీలకం. నేటి బలహీన మైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో బడ్జెట్ అంచనాల లో వినవస్తున్న ప్రతికూల అంశాలు నేడు మన మార్కెట్ల సెంటిమెంట్ ని బలహీన పరిచే అవకాశం ఉంది. నేడు ప్రధానం గా మార్కెట్లు bears గుప్పెట్ల లో ఉండనున్నాయి. ఐతే రైల్ బడ్జెట్ లో లాభాపొందే స్టాకులు వారిగా నేడు మదుపరులు కొనుగోళ్ళ పట్ల ఆసక్తి కనపరచవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16286
  • అవరోధాలు: 16340-16486-16527
  • మద్దత్తులు:16252-16191-16124-16064