• 24-2-2010
  • మార్కెట్ రిపోర్ట్

నేడు మరొక సారి మన మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. రైల్ బడ్జెట్, రేపు ముగియ బోయే ఫిబ్రవరి తాలూకు f& o ముగింపు , ఎల్లుండి కేంద్ర బడ్జెట్ మున్నగు కీలక అంశాల నేపధ్యం లో నేడు మార్కెట్లు అప్రమత ధోరణి తో ట్రేడ్ అయ్యాయి.

నేటి ట్రేడింగ్ లో నిఫ్టీ పాయింట్ల 11 నష్టాన్ని నమోదు చేసి 4858పాయింట్ల వద్ద ముగియగా , నష్టాన్ని నమోదు చేసి సెన్సెక్స్ 30 పాయింట్లు నష్టపోయి 16255 పాయింట్ల వద్ద ముగిసింది.ఇది మేముఉదయం సూచించిన కీలక మద్దతు స్థాయి అయిన 16252 పాయింట్లకి అత్యంత చేరువగా ఉండటం విశేషం . నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.41 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.61 శాతం కోల్పోయాయి. సేక్టరాల్ సూచీ ల లో నేడు రియాలిటి సూచీ అత్యధికం గా 0.93 శాతం లాభపడింది. కాగా ఐ. టి సూచీ 0.03 % స్వల్ప లాభాన్ని నమోదు చేసింది. కాగా కన్సుమర్ డ్యురబుల్ 1.31 % , హెల్త్ కేర్ 0.64 % నష్టపోయింది.

నేటి ట్రేడింగ్ లో ఆటో స్టాకులు అమ్మకాల వత్తిడి కి గురి అయ్యాయి. బడ్జెట్ లో ఎక్సైజ్ డ్యూటీ విధించే అంచనాలు ఉండటం తో ఈ స్టాకులు నష్టపోయాయి. నేడు రైల్వే మంత్రి జనాకర్శ రైల్వే బడ్జెట్ విడుదల చేయటం తో కార్పోరేట్లకు మొండి చేయి మిగిలింది. దీనితో రైల్వే స్టాకు లైన TITAGARH WAGON, KALINDEE RAIL NIRMAN,TEXMACO, STONE INDIA మున్నగు స్టాకులు సుమారు 3 నుండి 9 % క్షీణించాయి . రైల్ బడ్జెట్ లో రవాణా చార్జీలు కూడా పెంచక పోవటం తో ACC, REI AGRO , KOHINOOR FOODS మున్నగు స్టాకులు లాభపడ్డాయి. నిన్న నష్టపోయిన REC ప్రభుత్వసహాయం లభించగలదన్న అంచనాల తో నేడు లాభపడింది. ZAIN తో ఒప్పందం కొరకు నిధుల కై భారతి అయిర్ టెల్ SBI ని సమీపించిందని వార్తల నేపధ్యం లో భారతి అయిర్ టెల్ 1.38 % నష్టపోయింది.

ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే సన్ ఫార్మ 2.51 % , MNM 2.43 % నష్ట పోయాయి . కాగా మారుతి 2.38 % , NTPC 1.36 % మేరకు లాభపడ్డాయి.