• 10-2-2010
  • మార్కెట్ నాడి

ఆర్ధిక సంక్షోభం లో వున్న గ్రీస్ దేశాన్ని ఆదుకునే దిశ గా జర్మనీ మరియు ఇతర ఐరోపా దేశాలు నడుం బిగించ నున్నాయన్న వార్త వెలవడటం తో గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. గత వారం రోజులు గా భారీగా క్షీణించిన స్టాకు ల లో కొనుగోలు చోటుచేసుకోవటం తో అక్కడి మార్కెట్లు లాభాలను ఆర్జించాయి . నేడు హాంగ్ సెంగ్ మినహా , ఇతర ఆసియా మార్కెట్లు కూడా అమెరికా అందించిన ఊతం తో లాభాల బాట లో నడుస్తున్నాయి. ముఖ్యం గా జపాన్ మార్కెట్ల లో విడుదల అయిన మషీన్ ఆర్డర్ల గణాంకాలు అంచనాలను మించి , 20 % మేరకు వృద్ధి నమోదు చేయటం తో అక్కడి మార్కెట్లు బలపడుతున్నాయి. సానుకూల ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో ,మన మార్కెట్లు కూడా నిన్న టి లాభాలను నేడు కొనసాగించే అవకాశం ఉంది. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ FITCH భారత ఆటో మొబైల్ రంగం పై విడుదల చేసిన రిపోర్ట్ కూడా ఆశాజనకం గాఉండటం, ముఖ్యం గా ఆటో విడి భాగాల తయారి కంపనీల కి మంచి అవకాశం ఉందని పేర్కొనటం మన మార్కెట్ల సెంటిమెంట్ ని మరింత మెరుగు పరచ నున్నది. ఇది ఇలా ఉండగా , BT వంకాయల పై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం ప్రకటించింది. మరిన్ని పరిశోధనలు ని చేపట్టిన తరువాతే ఈ వంకాయల సాగు కి అనుమతి ఇవ్వాలని పేర్కొనటం తో ఈ గింజలను ఉత్పత్తి చేసే MONSANTO వాటాలు కొంత క్షీణించే అవకాశం ఉంది. విశాఖపట్నం లో ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన ఆయిల్ మార్కెటింగ్ కంపనీల కి లాభదాయకం. సానుకూల ఆసియా మార్కెట్ల నేపధ్యం లో మార్కెట్లు శుభారంభం చేసే అవకాశం ఉంది. మధ్యాన్నం తదుపరి UK మార్కెట్ తీరు మన మార్కెట్లను ప్రభావితం చేయనున్నది. UK కి గల పెట్టుబడి రేటింగ్ AAA కోల్పోయే వార్తలు వినవస్తున్నందున మదుపరులు కొంత అప్రమత్త తో వ్యవహరించటం మంచిది

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16042
  • అవరోధాలు: 16064-16124-16252
  • మద్దత్తులు16002-:15831-15660