• 10-2-2010
  • మార్కెట్ రిపోర్ట్

గత మూడు రోజులు గా లాభాల బాట లో నడిచిన మన మార్కెట్ల లో నేడు ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవటం తో నష్టపోయాయి. దీనితో సెన్సెక్స్ 120 పాయింట్లను త్యజించి 15922 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 35 పాయింట్ల నష్టం తో 4757 పాయింట్ల వద్ద ముగిసింది.

ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారుడు రంగరాజన్ నేడు ఒక ఒక సమావేశం లో ప్రభుత్వం ఉద్దేపణలు వెను తీసుకునే విధి విధానం గురించి కసరత్తు చేయవచ్చని ప్రకటించటం తో నేడు మార్కెట్ల సెంటిమెంట్ బలహీనపడింది.

ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.01 శాతం, స్మాల్ క్యాప్ రంగం 0.1 శాతం మేరకు లాభపడటం విశేషం. స్టాకు ల పరం గా నేడు గుడ్ ఇయర్ వాటాలు వరుసగా రెండవ రోజు 20 % గరిష్ట స్థాయి చేరుకుంది. ఈ కౌంటర్ BSE నుండి డి లిస్టింగ్ చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కాగా సెయిల్ విషయం లో ఎటువంటి బోనస్ ఇవ్వబోమని ప్రకటించటం తో ఈ వాటలు నిన్నటి లాభాలను విసర్జించింది. ప్రభుత్వం నుండి 228 కోట్ల ప్రాజెక్ట్ దక్కించుకోవటం తో NIIT నేడు 7.5 % లాభపడింది.

సేక్టరాల్ సూచీ ల లో నేడు కన్సుమర్ డ్యురబుల్స్ అత్యధికం గా 092 % లాభపడగా రియాలిటీ 0.88 % వృద్ధిని నమోదు చేసింది. నేడు క్యాపిటల్ గూడ్స్ 1.21 % , PSU 1.07 % నష్టపోయాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు హిందాల్కో 1.71 % , HDFC బ్యాంక్ 1.49 % లాభపడ్డాయి . కాగా MNM 3.42%,SBI 2.14% నష్టాలను చవిచూసాయి.