- 08-02-2010
- మార్కెట్ నాడి
గ్రీస్ దేశం లో నెలకొని వున్న సంక్షోభం వలన యూరో కరెన్సీ అస్థిరత కి లోనయ్యే అవకాశం ఉందని జపాన్ యెన్ బలపడటం తో జపాన్ మార్కెట్లు నేటి ఉదయం నష్టాల తో ప్రారంభ మయ్యింది. కాగా గత శుక్రవారం అమెరికా మార్కెట్ల లో సానుకూల నిరుద్యోగ గణాంకాల వలన అక్కడి మార్కెట్లు లాభపడ్డ విషయం విదితమే. ఈ కారణం గా శని వారం ప్రత్యేక ట్రేడింగ్ లో మన మార్కెట్లు లాభపడ్డాయి. ఇదే కారణం వలన నేడు ఇతర ఆసియా మార్కెట్లు లాభాల తో పయనిస్తున్నాయి.
మిశ్రమ ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నేడు మరొక సారి మన మార్కెట్లు ప్రారంభం కానున్నాయి. G 7 దేశాలు కెనడా లో ముగించిన సమావేశం లో గ్రీస్ దేశపు సమస్య ని సమిష్టి గా పరిష్కరించ వచ్చని ప్రపంచ మార్కెట్ల కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసాయి. ఈ కారణం గా మన మార్కెట్ల లో కొంత సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దిద్దుబాటు గురించి నిరీక్షిస్తున్న మదుపరులు కొంత పెట్టుపడి పెట్టె అవకాశం ఉన్నందున మన మార్కెట్ల లో నేడు కూడా కొంత కొనుగోలు కనిపించే అవకాశం లేక పోలేదు. ఐతే ఈ పెరుగుదల ఎక్కువకాలం నిలిచే అవకాశం తక్కువ అని మరువకూడదు. ప్రభుత్వం గత దశాబ్దం లో UTI ని ఆదుకునేందుకు UTI నుండి వాటాలను కొనుగోలు చేయటం జరిగింది. ప్రస్తుతం బడ్జెట్ లోటు ని అధికమించే దశ గా , ప్రభుత్వం అలనాడు కొన్న వాటాలను అమ్మివేసే అవకాశం ఉందన్న వార్తలు వెలవడుతున్నాయి. ప్రభుత్వం ఈ వాటాలని మార్కెట్ల లో విక్రయించ దలిస్తే , ఆపరేటర్లు మార్కెట్లను కూల దోసి , తక్కువ ధరకి ప్రభుత్వం నుండి వాటాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చు. ఐతే ప్రభుత్వం ఈ వాటాలను మార్కెట్ల లో కాక LIC మున్నగు సంస్థాగత మదుపరులకు కూడా అమ్మే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయం లో చేపట్టే విధానం పై మార్కెట్ స్థితి గతులు ఆధారపడనున్నది .కాబట్టి మదుపరులు , మార్కెట్ల దిశ స్థిర పడే వరకు కొంత నిరిక్షించటం ఉత్తమం
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 15915
- అవరోధాలు: 15957-16064-16124-16252
- మద్దత్తులు:15831-15663-15554