- 6-2-2010
- మార్కెట్ నాడి
నేడు BSE, NSE పరిశోధాత్మకం గా తలపెట్టిన ప్రత్యేకే ట్రేడింగ్ నేపధ్యం లో నేడు మార్కెట్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాన్నం 12:30 వరకు ట్రేడ్ కానున్నాయి.
నేటి ట్రేడింగ్ లో మన మార్కెట్లను ప్రభావితం చేసే కీలక అంశాలను చర్చిస్తే, ప్రథమంగా.... గత రాత్రి ముగిసిన అమెరికా మార్కెట్లు నేడు మన మార్కెట్లకు సానుకూల సంకేతాలను పంపింది. నిన్న విడుదల ఐన నిరుద్యోగ గణాంకాల లో తగ్గుదల నమోదు కావటం తో అమెరికా మార్కెట్లకు ఊరట కలిగింది. దీనితో ముందుగా నష్టాల లో కూరుకు పోయిన అమెరికా మార్కెట్ల లో చివరి గంట ట్రేడింగ్ లో షార్ట్ కవేరింగ్ చోటు చేసు కొని చివరికి లాభాల తో ఈ వారాన్ని ముగించింది. వారాంతపు సెలవల లో షార్ట్ పొజిషన్ల పట్ల ట్రేడెర్ల కు కలిగిన విముఖత, అలాగే గ్రీసు, పోర్చుగల్ , స్పెన్ దేశాల లో చోటు చేసుకుంటున్న తీవ్ర బడ్జెట్ లోటు ని ఎదురుకునే విధం గా G7 , మరియు ఇతర ఐరోపా దేశాలు మద్దత్తు ప్రకటించ వచ్చన్న అంచానాల తో అమెరికా మార్కెట్లు బలపడ్డాయి.ఈ అంశం పై నేడు కెనడా లో G7 దేశాలు చర్చించనున్న నేపధ్యం లో ఈ వాదనకి మరింత బలం చేకూరింది. దీనితో అప్పటివరకు తీవ్ర పతనానికి గురి అయిన బంగారం, ముడి చమురు , మున్నగు కమోడి టి లు కూడా తిరిగి లాభాలను ఆర్జించాయి.
నేడు ఇతర ఆసియా మార్కెట్ల కు సెలవ కనుక మన మార్కెట్లు నేడు కేవలం అమెరికా మార్కెట్ల ను మాత్రమె అనుకరణ కి పరిగనించ నున్నాయి.
ఇక మన మార్కెట్ల పరం గా యోచిస్తే, పెట్రో వడ్డన కి ఇది సరి ఐన సమయం కాదని IMF సూచిస్తే , ప్రణాళిక సంఘానికి చెందిన మోన్ టెక్ సింగ్ ఆహువలియా మాత్రం పెట్రోల్ ధరలను పెంచితే నే మంచిదని, ధరల పెరుగుదలను నియంత్రించవచ్చని వింత వాదనని వెలుబుచ్చారు. ఇది ఇలా ఉండగా, రిజర్వు బ్యాంక్ డిప్యుటి గవర్నర్ , కీలక వడ్డీ రేటుని తొందరపడి పెంచబోమని స్పష్టం చేసారు. నిన్న రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నార్, ప్రధానమంత్రి ఆర్ధిక సలహాదారుడు రంగరాజన్ కూడా దాదాపు ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉద్దేపణలు ఇప్పట్లో ఉపసంహరించ బోమని ప్రభుత్వం తరుఫున ప్రకటించారు.
ఈ అంశాల వలన నేడు మన మార్కెట్ల లో ని బుల్ల్స్ నకు స్వల్పంగా ఊరట కలిగే అవకాశం ఉంది. పైగా నేటి ట్రేడింగ్ వ్యవధి కేవలం గంట న్నర మాత్రమె కనుక కొత్త గా INTRA DAY షార్ట్లు ఏర్పడే అవకాశం అతి తక్కువ . అంతేకాక నేడు వారాంతం కనుక సహజం గా నే కొంత మేరకు షార్ట్ కవేరింగ్ కూడా చోటుచేసుకునే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 15790
- అవరోధాలు: 15831-15957- 16064
- మద్దత్తులు:15663-15554